Vegetables: మండిపోతున్న కూరగాయల ధరలు.. పచ్చి మిర్చి అయితే మరీ దారుణం
ఇప్పటివరకు చికెన్ మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి వైపు చూసే ఆశ కూడా లేదు. తాజా కూరగాయల రేట్లపై ఓ లుక్కేద్దాం పదండి..
హైదరాబాద్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరీ ముఖ్యంగా మిర్చి రేట్ ఘాటెక్కిస్తోంది.. ముట్టుకోకుండానే మంటెక్కిస్తోంది.. రైతు బజార్ లోనే కిలో రూ.120 పలుకుతున్న పచ్చిమిర్చి..ఇళ్ల దగ్గర కొట్టుల్లో మాత్రం పరేషాన్ చేస్తోంది.. ఒక్కోచోట 150 రూపాయలు కూడా పలుకుతోంది. ఇక టమాటా కూడా కిలో 80 రూపాయలకు తగ్గడం లేదు. ఇవి మాత్రమే కాదు..బీరకాయ, బీన్స్, వంకాయ ఏవి కొనాలన్నా జేబులకు చిల్లులు తప్పడం లేదు. నోరు కట్టేసుకుందామంటే కుదరదు..కనీసం చారు, సాంబారుతో కానిచ్చేద్దామనుకున్నా..ఒక్క టమాటా అయినా వేయకపోతే రుచి పచి ఉండదు.. సో.. సాంబారు నీళ్లకూ కష్టకాలమొచ్చిందిరా అని జనం అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు 200 పెడితే కూరగాయలతో సంచి నిండిపోయేది..ఇప్పుడు వెజిటబుల్స్‌ను హ్యాండ్ బ్యాగుల్లో సర్దాల్సి వస్తోంది. అంత ప్రియం అయ్యాయి..ఏం చేద్దాం..
హైదరాబాద్లో మాత్రమే కాదు.. ఏపీలో కూడా ఇదే పరిస్థితి.. విశాఖలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఇప్పుడు కాయగూరల రేట్లు మండిపోతున్నాయి. ఇక అటు మటన్ 1000 టచ్ అవుతుంది. ఇటు చికెన్ 300 దాటిపోయింది. మొత్తంగా సామాన్యులకు ప్రజంట్ గడ్డు కాలం నడుస్తుంది. బాబోయ్ ఇవేం ధరలు అంటూ నెత్తీ నోరు బాదుకుంటున్నారు. ఏంటో.. వచ్చే జీతాలు అన్నీ తినడానికే సరిపోయేటట్లు ఉన్నాయ్.. ఇక సేవింగ్స్ గురించి మర్చిపోవడమే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..