AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: “సమాచారం మాకు – బహుమతి మీకు” మావోయిస్టుల సమాచారం కోసం ఇంటింటికీ స్టికర్లు.. కొత్తగా ప్లాన్ చేసిన పోలీసులు

మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి పోలీసులు దూకుడు పెంచారు. భద్రాద్రి జిల్లాలోని గుత్తి కోయల గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. స్వయంగా ఐపీఎస్ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్‌తో ముందుకు..

Telangana: సమాచారం మాకు - బహుమతి మీకు మావోయిస్టుల సమాచారం కోసం ఇంటింటికీ స్టికర్లు.. కొత్తగా ప్లాన్ చేసిన పోలీసులు
Asp Paritosh Pankaj
Sanjay Kasula
|

Updated on: Jun 26, 2023 | 3:50 PM

Share

భద్రాద్రి, జూన్ 26: తెలంగాణలో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీకి చెందిన నక్సలైట్ల కోసం తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్ గడ్, మహారాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సరిహద్దు అటవి గ్రామాల్లోకి మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసులు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇక ఏకంగా మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి పోలీసులు దూకుడు పెంచారు. భద్రాద్రి జిల్లాలోని గుత్తి కోయల గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. స్వయంగా ఐపీఎస్ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్‌తో ముందుకు కదులుతున్నారు.

గడప గడపకు వెళ్లి “సమాచారం మాకు – బహుమతి మీకు” అని డోర్ స్టికర్స్ అతికిస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలో పలు గుత్తి కోయలు గ్రామాల్లో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్,స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఈ ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టులు అభివృద్ది నిరోదకలుగా మారి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అమాయకపు ఆదివాసీలను దోచుకుంటున్నారని, వివిధ రకాలుగా భయపెడుతూ అభివృద్ధికి ఆదివాసీలను దూరం చేస్తున్నారనీ ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు వారి వివరాలను అందించాలని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

మావోయిస్టు పార్టీ వారి సిద్ధాంతాల పేరిట అమాయకపు ఆదివాసీ ప్రజలను వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆదివాసీ ప్రజలు ప్రశాంతమైన జీవనం గడపాలని కోరుకుంటున్నారు.. ప్రజలు ఎవ్వరూ కూడా మావోయిస్టులకు భయపడకుండా మావోయిస్టుల సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. డోర్ స్టికర్స్ పై ఉన్న ఫోన్ నెంబర్స్ కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే తగు బహుమతి ఇస్తామని  తెలిపారు. ఇటీవల మావోయిస్టు కార్యకలాపాల పెరుగుతున్న నేపథ్యంలో..సరిహద్దు ప్రాంతం, గొత్తి కోయల గ్రామాలపై పోలీసులు నిఘా పెంచారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం