AP SSC Board: ఎలాంటి రాత పరీక్షలేదు.. ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు) డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 11, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు 1 ఉన్నాయి.
ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎంఎస్ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో రిజర్వేషన్ వర్గాలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎంపికైతే నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.18,500, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.18,500లు జీతంగా చెల్లిస్తారు.
ఎలా ఎంపిక చేస్తారంటే..
పదో తరగతి/ఇంటర్/డిగ్రీలో వచ్చిన మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 7, 2023.
- ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి వివరాల వెల్లడి తేదీ: జులై 11, 2023.
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు: జులై 13, 14 తేదీలు
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తేదీలు: జులై 16, 17 తేదీలు
- తుది ఎంపిక వెల్లడి తేదీ: జులై 19, 2023.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.