TTD News: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే?

మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి. లేదంటే కొండపై ఎండలో మాడిపోవాల్సిందే.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లలో పిల్లా పెద్దలతో ఆపసోపాలు పడాల్సిందే. ఎందుకంటే రోజుకి 80వేలకు మించి భక్తులు తిరుమల కొండపైకి వెళ్తున్నారు.

TTD News: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే?
Tirumala
Follow us

|

Updated on: May 21, 2023 | 9:00 AM

మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి. లేదంటే కొండపై ఎండలో మాడిపోవాల్సిందే.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లలో పిల్లా పెద్దలతో ఆపసోపాలు పడాల్సిందే. ఎందుకంటే రోజుకి 80వేలకు మించి భక్తులు తిరుమల కొండపైకి వెళ్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఊహించని స్థాయిలో భక్తులు పోటెత్తడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ కారణంగా తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 40 గంటలకు మించి సమయం పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని నియంత్రించేందుకు.. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్‌ 30 వరకు స్వామివారి ఆర్జిత సేవలు.. వీఐపీ దర్శనాల్లో మార్పులు చేసింది. వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

టీటీడీ కీలక నిర్ణయాలు..

కాగా భక్తుల రద్దీ కారణంగా శుక్ర, శని వారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసింది టీటీడీ. ఈ నిర్ణయంతో 20 నిమిషాల సమయం ఆదా కానుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని.. దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని భావిస్తోంది టీటీడీ. అలాగే శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామంది. దీంతో రోజూ 3 గంటల సమయం ఆదా అవుతుందని టీటీడీ భావిస్తోంది. కీలక నిర్ణయాలతో 4 నుంచి 8 గంటల సమయం ఆదా అవుతుందంటున్నారు అధికారులు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో తిరుమలకు 70 నుంచి 80 వేల వరకు భక్తులు వస్తున్నారు. వారాంతాల్లో ఆ సంఖ్య లక్షకు పైగా ఉంటోంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు.. టీటీడీ తీసుకున్న నిర్ణయాలతో స్వామి వారి దర్శనం త్వరగా కలిగే అవకాశం ఉంది. మరోవైపు తిరుమలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని విఙ్ఞప్తి చేసింది టీటీడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తిరుమల వార్తల కోసం క్లిక్ చేయండి..

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..