AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: స్టూడెంట్ బ్యాగ్‌లో లిక్కర్ బాటిల్.. కట్ చేస్తే, ఎంత ఘోరం జరిగిందో తెలుసా..?

తిరుపతి చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో విషాదం చోటుచేసుకుంది.. మద్యం తాగి ఓ విద్యార్తి స్కూల్‌కు వెళ్లగా.. గమనించిన స్టూడెంట్స్ టీచర్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థిని పిలిపించి హెడ్‌మాస్టర్ మందలించారు.. అంతేకాకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు.. దీంతో భయపడి స్కూల్ గోడ దూకి పారిపోయిన స్టూడెంట్.. ముంగిలిపట్టు దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. 

Andhra: స్టూడెంట్ బ్యాగ్‌లో లిక్కర్ బాటిల్.. కట్ చేస్తే, ఎంత ఘోరం జరిగిందో తెలుసా..?
School Bag
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 16, 2025 | 11:03 AM

Share

ఏపీలో పాలిటిక్స్ అంతా లిక్కర్ చుట్టే తిరుగుతుంటే.. ఆ మద్యమే 10 వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకునేందుకు కారణమైంది. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన చంద్రగిరిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఒక విద్యార్థి.. రోజు మాదిరిగానే స్కూల్ బ్యాగ్ తో పాఠశాలకు చేరుకున్నాడు. అయితే, కాస్త తేడాగా కనిపించడంతో సహచర విద్యార్థులకు డౌట్ వచ్చింది. మద్యం వాసన పసిగట్టిన విద్యార్థులు.. ఆ స్టూడెంట్ లిక్కర్ సేవించినట్లు గుర్తించారు. విషయాన్ని క్లాస్ టీచర్ కు చేరవేశారు. టీచర్ వెంటనే ఆ స్టూడెంట్ ను విచారించాడు. స్కూల్ బ్యాగ్ లో పుస్తకాలతో పాటు లిక్కర్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పాఠశాల హెడ్మాస్టర్ దృష్టికి తీసుకెళ్లాడు.

దీంతో అప్రమత్తమైన హెచ్ఎం ఆ విద్యార్థిని తన గదికి పిలిపించి ఆరా తీశాడు. స్టూడెంట్ మద్యం తాగినట్లు అనుమానించి మందలించాడు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరగగా.. హెడ్మాస్టర్ వెంటనే తల్లిదండ్రులకు కబురు పెట్టారు. వారిని స్కూలుకు రావాలని సమాచారం ఇచ్చారు. దీంతో మద్యం తాగిన విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయం స్టూడెంట్ ను వెంటాడింది. వెంటనే అలర్ట్ అయిన స్టూడెంట్ పాఠశాల ప్రహరీ గోడ దూకి పరారీ అయ్యాడు.

విషయం తెలుసుకొని సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూలుకు చేరుకున్న తల్లిదండ్రులు స్టూడెంట్ ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే ఎక్కడా కనిపించని స్టూడెంట్ ముంగిలిపట్టు వద్ద రైల్వే ట్రాక్ పై విగతజీవిగా పడిఉన్నాడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వీడియో చూడండి..

ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పాకాల రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్టూడెంట్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు కూడా ఆరాతీస్తున్నారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం