AP TDP: ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే మూడు రాజధానులు: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు

ఏపీలో ప్రతి రోజు రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతుంటారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య ప్రతి రోజు రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా టీడీపీ..

AP TDP: ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే మూడు రాజధానులు: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు
Andhra Pradesh
Follow us

|

Updated on: Oct 15, 2022 | 3:40 PM

ఏపీలో ప్రతి రోజు రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతుంటారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య ప్రతి రోజు రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే మూడు రాజధానులను ప్రకటించారని, పాలన వికేంద్రీకరణకు నాంది పలికింది ఎన్టీఆర్ అని, ప్రజల వద్దకు పాలన చంద్రబాబు తీసుకువచ్చారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు పార్టీల మద్దతుతో అమరావతి రాజధాని అయ్యిందని, మొన్నటి వరకు మూతి కట్టుకుని ఇంట్లో ఉన్న ధర్మాన.. మంత్రి పదవొచ్చాక మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, సుజాల స్రవంతి కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా..?అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పేటీఎం బ్యాచ్ తో జేఏసీ పెట్టి మాట్లాడిస్తున్నారని, మేం కూడా జేఏసీ పెట్టి సేవ్ ఉత్తరాంద్ర పేరుతో ముందుకు వెళ్తామని అన్నారు.

మూడు ముక్కలాటతో అభివృద్ధి జరగదు:

మూడు ముక్కలాటతో రాష్ట్ర అభివృద్ధి జరగదని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ నినాదం ఏపీకీ ఒక్కటే రాజధాని అమరావతి అని అన్నారు. విశాఖ దేశంలో ఇప్పటికే గుర్తింపు ఉంది. రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందిందా..? విశాఖ గర్జనలో ఇతర మంత్రులను ముందు పెట్టి వెనక గంగిరెద్దుల్లా వెళ్లారు. విశాఖను ఆర్ధిక రాజధాని చేయాలి. రైతుల పాదయాత్ర ఉత్తరాంద్రలో సక్సెస్ చేస్తాం. ఏ సమయంలోనైనా ఎన్నికలకు వెళ్తారు.. అంతా కలిసి పనిచేద్దాం అని పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రాంతం ఉత్తరాంధ్ర: టీడీపీ ఎంపీ రామ్మోనహన్‌ నాయుడు

వైసీపీ పాలనలోఉత్తరాంధ్ర ప్రాంతం నష్టపోయిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రైల్వే జోన్ కోసం మాట్లాడకుండా రాజధాని కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు. జేఏసీ మేధావులు కూడా ఆలోచించాలని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మూడు రాజధానుల అంశం తీసుకువస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. విశాఖను ల్యాండ్ గ్రాబింగ్ క్యాపిటల్ గా చేస్తున్నారని, తెలుగువారి కోసం ఏపీలో ఏకైక రాజధాని అమరావతి అని, అమరావతి రైతులకు సంపూర్ణ స్వాగతం పలకాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవు: అయ్యన్నపాత్రుడు

ప్రపంచంలో ఎక్కడా కూడా మూడు రాజధానులు లేవని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు విఫలమయ్యాయని, విశాఖను ఆర్థిక రాజధానిగా చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయినప్పుడు ధర్మశ్రీ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. విశాఖ గర్జనకు రాకపోతే.. ప్రజలను బెదిరించారని, పీకే సర్వేతో జగన్ కి భయంపట్టుకుంది. అందుకే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజధానిని మార్చే అధికారం జగన్‌కు లేదని, అమరావతి రైతులను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్‌ విసిరారు.

గర్జన అనుకుని గాండ్రింపులు చెస్తున్నారు: కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు

వైసీపీ నేతలు గర్జన అనుకుని గాండ్రిపులు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు అన్నారు. మనిషికి ఒక్కటే తల.. ఏపీకి రాజధాని ఒక్కటే.. అమరావతి అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయకుండా సాకుతో వికంద్రికరణ అంటున్నారని, భోగాపురంలో రైతులు ఇచ్చిన భూములతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రోజా మాట్లాడే భాష నేను మాట్లాడలేను.. అటువంటి భాష వినే అవకాశం లేకుండా అదృష్టం కొద్దీ అసెంబ్లీ కాకుండా నన్ను పార్లమెంట్ కు పంపారని అన్నారు. అమ్మవారి ఆలయానికి ఎస్సీలు వేళ్ళకుండా డిప్యూటీ స్పీకర్ తాళం వేసి జేబులో పెట్టుకున్నారని, వైసీపీ నేతల్లా బూతుల సంస్కృతి మనది కాదని, అమరావతి రైతులను సాదరంగా స్వాగతం పలుకుదామని అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులార్పించిన టీడీపీ నేతలు

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంద్ర రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభించిన నేతలు.. చర్చ వేదిక కొనసాగించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఉత్తరాంద్ర కొ ఆర్డినేటర్ బుద్దా వెంకన్న, సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంద్ర జిల్లాల కో ఆర్డినేటర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ బారినుండి ఉత్తరాంద్రను కాపాడుకుందాం అనే అంశంపై చర్చ కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..