AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: కేటీఆర్‌ దత్తత ప్రకటనపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విసుర్లు.. ఫామ్‌హౌస్‌ కట్టుకోవడానికా అంటూ..

మునుగోడు దత్తత ప్రకటనపై ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న మునుగోడు బై పోల్‌ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.

Munugode Bypoll: కేటీఆర్‌ దత్తత ప్రకటనపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విసుర్లు.. ఫామ్‌హౌస్‌ కట్టుకోవడానికా అంటూ..
Kishan Reddy, KTR
Basha Shek
|

Updated on: Oct 15, 2022 | 3:41 PM

Share

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు నెలలకొకసారి మునుగోడుకు వస్తానని, సిరిసిల్లలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కాగా మునుగోడు దత్తత ప్రకటనపై ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న మునుగోడు బై పోల్‌ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల తర్వాత ఎంచెక్కా ఫామ్ హౌస్ ను తీసుకొండని వ్యంగ్యంగా విమర్శించారు. తెలంగాణ పేరంటేనే సీఎం కేసీఆర్ కు అసహ్యమని, అందుకే బీఆర్‌ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు.

‘మునుగోడు ఉప ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి ఆఖరి ఎన్నికలు కావాలి. టీఆర్‌ఎస్ వీఆర్ఎస్ తీసుకునే సమయలో బీఆర్‌ఎస్‌ అని కొత్త నాటకం ఆడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలతో టీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. ప్రాజెక్టుల పేరుతో హైదరాబాద్‌ లో దోపిడీ చేశారు. కోట్ల రూపాయలతో విమానం కొన్నాడు. సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్. మునుగోడులో ప్రజా పాలన కోసం బీజేపీకి ఓటు వేయాలి. కాగితాలతో రిజ్వేషన్లు రావు. కానీ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను టీఆర్‌ఎస్ మభ్య పెడుతోంది’ అని ధ్వజమెత్తారు కిషన్‌ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..