Telangana: కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి
మెదక్ జిల్లాలో కోళ్ల లోడుతో వెళ్తున్న వాహానం బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న వాహనం..అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కోళ్ల కోసం స్థానికులు పరుగులు తీశారు.
కోళ్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకొని వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లారు. కొన్ని కోళ్లు రోడ్డు పక్కనే ఉన్న వరిపొలంలో పడ్డాయి. కోతకు వచ్చిన వరి పొలం అని కూడ చూడకుండా కోళ్ల కోసం పొలంతోకి దిగారు కొందరు. దొరికాయ్‌రా నా సామి రంగా అంటూ ఇళ్లకు పరుగులు తీశారు.
కొందరైతే ఒక కోడితో సరిపెట్టుకోలేదండి. రెండు చేతుల్లో వీలునన్ని పట్టుకుని అక్కడి నుంచి ఉడాయించారు. కాగా వరిపొలం రైతు కోళ్ల కోసం వచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోళ్ల కోసం పొట్టకొచ్చిన వరి పొలాన్ని కూడా పట్టించుకోలేదంటూ సీరియస్ అయ్యాడు. కాగా 800 కోళ్లను మాయం చేసినట్టు డ్రైవర్ తెలిపాడు. ఈ ప్రమాదంలో అతడికి స్వల్ప గాయాలయ్యాయి.
పాపం డ్రైవర్‌కు దెబ్బలు తగిలాయా అని ఎవరూ చూడలేదు. కోళ్లు చిక్కినవాళ్లు సాయంత్రం దావత్ అనకుంటూ సబంరంగా ఇంటికి వెళ్లారు. దొరకనివాళ్లు.. అయ్యో మిస్సయ్యిపోయామంటూ నిట్టూర్చారు. అట్టా ఉంటది మరి ఈ కాలపు జనాలతో.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..