Telangana: మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్ గౌడ్‌ దంపతులు

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు షాకిచ్చి..

Telangana: మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్ గౌడ్‌ దంపతులు
Palle Ravikumar Goud
Follow us

|

Updated on: Oct 15, 2022 | 3:23 PM

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు షాకిచ్చి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా,  తాజాగా కాంగ్రెస్‌కు అక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనుగోడు కాంగ్రెస్‌ నేత పల్లె రవికుమార్‌ గౌడ్‌ దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన రవికుమార్‌ గౌడ్‌, ఆయన భార్య జ్యోతిలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. ప్రస్తుతం జ్యోతి చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.  బూర నర్సయ్య గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ తాజా రాజకీయ సమీకరణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్ కి కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా పల్లె రవికుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కు తెలియజేశానని, ఇందుకు కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మా వంతు కృషిని చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మార్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఏడ్చేసిన చిరాగ్ పాశ్వాన్
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. మరి క్రిష్ ?
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల భారతీయ మసాలా దినుసుల వ్యాపారం..
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?