Munugode Bypoll: మునుగోడులో హీట్ పుట్టిస్తున్న పోస్టర్ పాలిటిక్స్.. సంచలనం సృష్టిస్తున్న మరో రెండు పోస్టర్లు..
మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. బై పోల్ వార్‌లో రోజుకో రచ్చ రాజుకుంటోంది. మొన్నటికి మొన్న కాంట్రాక్ట్ పే పోస్టర్ల కాంట్రవర్సీ ముగియకముందే.. మరోసారి అదే సీన్ రిపీటైంది.
మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. బై పోల్ వార్‌లో రోజుకో రచ్చ రాజుకుంటోంది. మొన్నటికి మొన్న కాంట్రాక్ట్ పే పోస్టర్ల కాంట్రవర్సీ ముగియకముందే.. మరోసారి అదే సీన్ రిపీటైంది. ఈసారి చౌటుప్పల్‌లో పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు అంటూ చౌటుప్పల్‌లో పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే పోస్టర్లు వెలువడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పని ఎవరు చేశారన్నది మిస్టరీగా మారింది.
మరోవైపు చండూరులోనూ ఇలాంటి పోస్టర్లే వెలిశాయి.. ‘షా’ ప్రొడక్షన్ సమర్పించు.. ’18 వేల కోట్లు’ నేడే విడుదల.. ‘దర్శకత్వం కోవర్ట్ రెడ్డి’.. సత్యనారాయణ 70 ఎం.ఎం అంటూ సినిమా పోస్టర్ మాదిరిగా చండూరులో పోస్టర్లు వెలిశాయి. వరుస ఘటనలతో అయోమయంలో పడిపోయారు బీజేపీ నేతలు. ఓటమి భయంతోనే ఇలాంటి పోస్టర్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా, మునుగోడు ప్రజలు తమవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉపపోరులో బీజేపీ విజయం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కొత్తం కాదు.. రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ వేసిన రాత్రే చండూరులో భారీగా పోస్టర్లు అతికించారు. ఫోన్ పే తరహా కాంట్రాక్ట్ పే ద్వారా 18 వేల కోట్ల ట్రానాక్షన్ రాజగోపాల్ ఖాతాలో జరిగిందంటూ పోస్టర్లు వెలిశాయి. రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్లు కాంట్రాక్ట్ కేటాయించారంటూ వేల సంఖ్యలో షాపులు, గోడలకు రాత్రికే రాత్రి కొందరు అతికించారు. తాజాగా మరోసారి చండూరు, చౌటుప్పల్‌లో పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది.
ఇదిలాఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపు 129 మంది పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఎల్లుండి ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత ఎంత మంది బరిలో ఉంటారన్న దానిపై క్లారిటీ వస్తుంది. చర్లగూడం రిజర్వాయర్ భూ నిర్వాసితులు తమ నిరసన తెలిపేందుకు ఉపఎన్నికను అస్త్రంగా ఎంచుకున్నారు. పదుల సంఖ్యలో నామినేషన్ వేశారు. ఇక నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..