APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్.. ఆ రూట్లలో జర్నీ చేసిన వారికి అదిరిపోయే గిఫ్ట్స్!
నేటి నుంచి మచిలీపట్నం - విజయవాడ, మచిలీపట్నం-ఏలూరు, మచిలీపట్నం- బంటుమిల్లి వైపు నడిచే సర్వీసుల్లో ఈ గిఫ్ట్ స్కీంను అములు చేనునన్నట్లు మేనేజర్ తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తుంది. అలాగే ప్రయాణికుల సంక్షేమం కోసం ఎన్నో సదుపాయాలను ప్రవేశపెడుతోంది.ఈనేపథ్యంలో మచిలీ పట్నం డిపో పరిధిలో ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి- బహుమతి పట్టండి’ అనే పేరుతో సరికొత్త గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టారు. ఈమేరకు స్కీం వివరాలను డిపో మేనేజర్ తేలుపెద్ది రాజు వెల్లడించారు. నేటి నుంచి మచిలీపట్నం – విజయవాడ, మచిలీపట్నం-ఏలూరు, మచిలీపట్నం- బంటుమిల్లి వైపు నడిచే సర్వీసుల్లో ఈ గిఫ్ట్ స్కీంను అములు చేనునన్నట్లు మేనేజర్ తెలిపారు. ప్రయాణికులు తమ జర్నీ పూర్తైన తర్వాత స్టేజ్ వద్ద దిగేటప్పుడు టికెట్ వెనక పేరు, ఊరు. ఫోన్ నంబర్ తదితర వివరాలను రాసి బస్సులో ఏర్పాటు చేసిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లో వేయాలి.
ప్రతి 15 రోజుల కొకసారి లక్కీడిప్ ద్వారా ఇద్దరు విజేతలను ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని, ప్రయాణికులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఆకర్షణీయమైన బహుమతులు సొంతం చేసుకోవాలని మేనేజర్ కోరారు.





మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..
