AP News: కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి.. అమ్మాయిలపై అలా ప్రవర్తిస్తూ..
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బుద్ది తప్పాడు. విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు నిలదీయడంతో యాజమాన్యం ఆయన్ను విధులు నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. నేటి సమాజంలో ఆడపిల్లకు రక్షణ కరువవుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా తిరిగి ఇంటికి చేరుతుందా లేదా అన్న ఆందోళన తల్లిదండ్రులలో నెలకొంటోంది.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బుద్ది తప్పాడు. విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు నిలదీయడంతో యాజమాన్యం ఆయన్ను విధులు నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. నేటి సమాజంలో ఆడపిల్లకు రక్షణ కరువవుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా తిరిగి ఇంటికి చేరుతుందా లేదా అన్న ఆందోళన తల్లిదండ్రులలో నెలకొంటోంది. సరస్వతి నిలయాలుగా భావించే విద్యాసంస్థల్లో సైతం అమ్మాయిలకు లైంగిక వేదింపులు తప్పటం లేదు. గురు బ్రహ్మ.. గురు విష్ణుః.. అని భావించే ఉపాధ్యాయులే అభంశుభం తెలియని చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వృత్తికే కళంకం తెస్తున్నారు. విద్యా బుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన వారు పిల్లల పట్ల వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఇలాంటి ఓ కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు గుట్టుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. నారాయణరావు అనే ఉపాధ్యాయుడు 6, 8 తరగతి చదువుచున్న బాలికలను వేధింపులకి గురి చేస్తున్నాడు. క్లాస్ రూమ్‌లలో చిన్నారులను టచ్ చేయకూడని చోట టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన విద్యార్ధినిలు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిని, స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో దిగి వచ్చిన యాజమాన్యం టీచర్ పట్ల సీరియస్ అయ్యింది.
ఘటనపై మండల విద్యాశాఖాధికారి విచారణ..
తల్లిదండ్రుల ఆందోళనతో స్కూల్ యాజమాన్యం దిగివచ్చింది. నారాయణ రావును విధుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే విషయం ఆమదాలవలస MEO కి తెలియటంతో సోమవారం స్కూల్‌కి వెళ్లి విచారణ చేపట్టారు మండల విద్యాశాఖ అధికారి. చిన్నారుల తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిచి జరిగిన ఘటనపై ఆరా తీసారు. పాఠశాల యాజమాన్యంతోను చర్చించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఆ కీచక ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశానని.. మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని MEO సమక్షంలోనే తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. మరోవైపు తాను విచారణ చేపట్టిన దానిపై నివేదిక తయారు చేసి DEOకి, డిప్యూటీ డిఇఓకి పంపిస్తానని తెలిపారు. తదుపరి అధికారుల నుండి వచ్చిన అదేశాలు ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని MEO తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అమ్మాయిల పట్ల ఎప్పుడు తల్లిదండ్రులు ఒక కన్ను వేసి ఉంచాలని ఈ ఉదంతం తెలియజేస్తుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల చిన్నతనంలోనే బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని చెబుతోంది ఈ ఉదంతం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..