Fire Accident: మాటలకు అందని విషాదం.. పెళ్లి కోసం సిద్ధంగా ఉంచుకున్న సొమ్మంతా బుగ్గిపాలు..!

కర్నూలు జిల్లాలో విషాదం మిగిలింది. చెల్లెలు పెళ్ళి కోసం అన్నలు పడ్డ శ్రమంతా వృధా అయ్యింది. బంధువులకు పెళ్లి ముహూర్తం కుదిరిందని సమాచారం అందించారు. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది. తొందరలో జరగాలిసిన పెళ్లి కోసం అప్పు సొప్పు చేసి, తెచ్చుకున్న నగదు, బంగారు , వెండి ఆభరణాలు ఇంట్లో దాచిపెట్టారు. ఇక ముహుర్తపు ఘడిల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముంచుకొచ్చిన ప్రమాదంలో సొమ్మంతా అగ్నికి ఆహుతి అయ్యాయి.

Fire Accident: మాటలకు అందని విషాదం.. పెళ్లి కోసం సిద్ధంగా ఉంచుకున్న సొమ్మంతా బుగ్గిపాలు..!
Fire Accident
Follow us
J Y Nagi Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 20, 2024 | 3:04 PM

కర్నూలు జిల్లాలో విషాదం మిగిలింది. చెల్లెలు పెళ్ళి కోసం అన్నలు పడ్డ శ్రమంతా వృధా అయ్యింది. బంధువులకు పెళ్లి ముహూర్తం కుదిరిందని సమాచారం అందించారు. పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది. తొందరలో జరగాలిసిన పెళ్లి కోసం అప్పు సొప్పు చేసి, తెచ్చుకున్న నగదు, బంగారు , వెండి ఆభరణాలు ఇంట్లో దాచిపెట్టారు. ఇక ముహుర్తపు ఘడిల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముంచుకొచ్చిన ప్రమాదంలో సొమ్మంతా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్కసారిగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో దుఃఖాన్ని తెప్పిచింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేమల గ్రామానికి కటికె మోహన్ రావు, నాగేశ్వరరావు చెల్లెలు పెళ్ళి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు ఇక్కడ ఇక్కడ అప్పు తెచ్చి చెల్లెలు పెళ్ళి ఘనంగా చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం 15 లక్షల రూపాయల నగదు,10 తులాల బంగారం, 20 తులాల వెండి అప్పు రూపంలో తెచ్చుకుని పెళ్లి వేడుకలకు ఇంట్లో ఉంచారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా ఇల్లు దగ్ధంమైంది. ఇరుగుపొరుగు వారితో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చిన ఫలితం లేకుండాపోయింది.

మంటల్లో ఇంట్లో ఉన్న దాదాపు 15 లక్షల రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. కళ్ళ ముందే సొమ్మంతా బూడిదవుతుంటే చూస్తూ ఉండిపోయిన బాధితులు బోరున విలపించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ఏమి చేయాలో అర్థం కాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..