Pawan Kalyan: పొత్తుల అంశంపై ఢిల్లీకి జనసేనాని.. ఆ తర్వాతే అభ్యర్ధుల ప్రకటన.?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఓ వైపు చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు జనసేన తరపున నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్న విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఓ వైపు చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు జనసేన తరపున నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్న విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాకకు సుందరపు సతీష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్‌లను నియమించారు. అధికారికంగా అభ్యర్థులని కాకుండా 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు.
గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారనే కారణంతో తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు, రాజానగరంలో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు.
అయితే పొత్తులు ఖరారు కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనను పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నట్టు సమాచారం. నిన్న విశాఖలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా జనసేన అభ్యర్థులపై ఆయన నేతలతో చర్చించనున్నారు. ఈనెల 22న ఢిల్లీ వెళ్లనున్న పవన్‌కల్యాణ్.. బీజేపీ పొత్తులతో వారితో చర్చింనున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తరువాత పొత్తులతో పాటు ఏయే సీట్లలో జనసేన పోటీ చేస్తుందనే అంశంలో క్లారిటీ రావొచ్చని జనసేన నేతలు భావిస్తున్నారు.