Venkaiah Naidu: బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్‌లో సమాధానం చెప్పాలిః వెంకయ్య నాయుడు
పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని విద్యార్థులకు ఉద్బోధించారు మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ఎం. వెంకయ్య నాయుడు. విలువలతో కూడిన విద్య ఉంటే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు. ఏ దేశంలో అయితే బాధ్యతగల పౌరులు ఉంటారో ఆ దేశం శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని వెంకయ్య నాయుడు అన్నారు.
పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని విద్యార్థులకు ఉద్బోధించారు మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ఎం. వెంకయ్య నాయుడు. విలువలతో కూడిన విద్య ఉంటే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు. ఏ దేశంలో అయితే బాధ్యతగల పౌరులు ఉంటారో ఆ దేశం శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రస్తుతం చట్టసభలు, సభల్లో రాజకీయ నాయకుల భాషను ప్రస్తావిస్తూ.. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులను పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని సూచించారు. అలాంటి వ్యక్తులు, శక్తులను ఎన్నికల్లో ప్రోత్సహించరాదనీ సూచించ్చారు.
విశాఖ సీతమ్మధార ఎస్ ఎఫ్ ఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విలువలు సాంప్రదాయాలు పరిరక్షించుకుంటే దేశం నెంబర్ వన్ గా ఎదుగుతుందన్నారు వెంకయ్య నాయుడు. మాతృభాష కళ్ళు పరాయి భాష కళ్లద్దాలు లాంటివని అన్నారు. ఇంగ్లీషు నేర్చుకోవాలి కానీ ఇంగ్లీష్ వాడిలా కాకుండా భారతీయుడులా జీవించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరి పట్ల భక్తి కలిగి ఉండాలని సూచించారు. ఉన్నత విలువలతో ఉన్న స్థాయికి ఎదగాలని సూచిస్తూ అబ్దుల్ కలాం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితన్ని గుర్తు చేశారు.
చదువుతోపాటు సంస్కారం కూడా ముఖ్యమని చెప్పిన వెంకయ్య నాయుడు.. విలువలతో కూడిన విద్య ఉంటే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు. ప్రస్తుత కాలంలో విలువలు తగ్గిపోతున్నాయని అది మంచిది కాదని అన్నారు. చదువుతోపాటు సంస్కారం కూడా ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రస్తుతం ఏ విషయానికైనా ప్రజల గూగుల్ వైపు చూస్తున్నారని, గూగుల్ గురువును మించినది కాదని, గూగుల్‌కు రిపేరు వచ్చినా గురువే కావాలనే విషయాన్ని గ్రహించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
ప్రశాంతతతో ఉండండి.. అపహస్య పరిణామాల వైపు దృష్టి పెట్టొద్దు..
మరోవైపు మనసు ప్రశాంతతతో ఉండాలని విద్యార్థులకు సూచించిన మాజీ ఉపరాష్ట్రపతి.. అనవసర విషయాల జోలికిపోయి.. టెన్షన్ పెట్టుకోవద్దని హితబోధ చేశారు. రాజకీయ నాయకుల అపహస్య పరిణామాలపై ధ్యాస పెట్టొద్దని విద్యార్థులకు సూచించారు. రాజకీయ నాయకులు స్థాయిని మరువరాదని గౌరవభావంతో ఉండాలన్నారు వెంకయ్య నాయుడు. చట్టసభలు, సభల్లో బూతులు మాట్లాడే వాళ్ళని గుణపాఠం చెప్పాలని అన్నారు. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు ఏం చేయాలని కొంతమంది నన్ను అడిగితే.. పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని సూచించానని అన్నారు వెంకయ్య నాయుడు. అలాంటి వ్యక్తులు శక్తులను ఎన్నికల్లో ప్రోత్సహించరాదని అన్నారు. అవినీతి, అక్రమాలు పాల్పడేవారిని, తప్పుడు పదజాలం వాడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాళ్లను అభినందించారు. టీచర్లు, విద్యార్థులతో ఫోటోలు దిగారు. దేవుడు ఏం కావాలని కోరితే మళ్ళీ విద్యార్థి దశను కావాలని కోరుకుంటానని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రిన్సిపాల్ రెవరెండ్ మనోజ్ , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…