AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: మాస్క్‌లు వేసుకుని.. ఇనుప రాడ్లు పట్టుకుని..! అమ్మో బాబోయ్ రాటు తేలిన దొంగల ముఠా..!

విశాఖపట్నం శివారు ప్రాంతాల్లో మళ్ళీ దొంగలు రెచ్చిపోతున్నారు. అడపాదడపా ఆయా ప్రాంతాల్లో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఓ దొంగల ముఠా హల్చల్ చేయడం కలకలం సృష్టించింది. నలుగురు సభ్యుల ముఠా.. ముఖాలకు మాస్కులు ధరించి, చేతిలో రాడ్లు పట్టుకుని ఇళ్లలోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో జనం వణికిపోతున్నారు.

Vizag: మాస్క్‌లు వేసుకుని.. ఇనుప రాడ్లు పట్టుకుని..! అమ్మో బాబోయ్ రాటు తేలిన దొంగల ముఠా..!
Thieves In Vizag
Maqdood Husain Khaja
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 20, 2024 | 4:05 PM

Share

విశాఖపట్నం శివారు ప్రాంతాల్లో మళ్ళీ దొంగలు రెచ్చిపోతున్నారు. అడపాదడపా ఆయా ప్రాంతాల్లో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఓ దొంగల ముఠా హల్చల్ చేయడం కలకలం సృష్టించింది. నలుగురు సభ్యుల ముఠా.. ముఖాలకు మాస్కులు ధరించి, చేతిలో రాడ్లు పట్టుకుని ఇళ్లలోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో జనం వణికిపోతున్నారు.

విశాఖలోని పెందుర్తి పరిసర ప్రాంతాల్లో దొంగల ముఠా హల్చల్ చేసింది. మూడు ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు.. రెండు ఇళ్లల్లో చోరీలు చేశారు. అందిన కాడికి బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సీసీ కెమెరాలు లో దొంగల దృశ్యాలు రికార్దయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెందుర్తి పులగవానిపాలెం రోడ్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నలుగురు సభ్యుల ముఠా చొరబడ్డారు. ముఖానికి మాస్కులు వేసుకుని, చేతిలో ఇనుప రాడ్లు పట్టుకుని బ్యాగులతో వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దొంగలు తెల్లవారుజామున బయటకు వచ్చారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇదే ముఠా మరో రెండు ఇళ్లల్లోకి కూడా చొరబడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు పోలీసులు.

లోకల్ గ్యాంగ్ పనా? లేక ఇతర రాష్ట్రాల ముఠాలు విశాఖలోకి ఎంటర్ అయ్యాయా అనే దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఒకేసారి మూడు వేర్వేరు చోట్ల దొంగలు ఇళ్లలోకి చొరబడడం ఎప్పుడూ విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…