Andhra Pradesh: బతకడం కన్నా చావడం మేలు.. చెప్పుతో కొట్టుకుంటూ కౌన్సిలర్ నిరసన.. వీడియో
Narsipatnam Municipal meeting: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ సమావేశంలో జరిగిన.. ఈ సంఘటన పొలిటికల్‌గా సంచలనం రేపుతోంది. విపక్ష సభ్యుడిని కావడం వల్లే.. తన ప్రాంత అభివృద్ధికి సహకరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కౌన్సిలర్ రామరాజు. ఏం చేయాలో తెలియక.. ఇలా సమావేశ మందిరంలోనే చెప్పుతో తనను తాను కొట్టుకుంటూ నిరసన తెలిపారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

Narsipatnam Municipal meeting: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ సమావేశంలో జరిగిన.. ఈ సంఘటన పొలిటికల్‌గా సంచలనం రేపుతోంది. విపక్ష సభ్యుడిని కావడం వల్లే.. తన ప్రాంత అభివృద్ధికి సహకరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కౌన్సిలర్ రామరాజు. ఏం చేయాలో తెలియక.. ఇలా సమావేశ మందిరంలోనే చెప్పుతో తనను తాను కొట్టుకుంటూ నిరసన తెలిపారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో టీడీపీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు తీవ్ర ఆవేదనకి లోనయ్యారు. కౌన్సిలర్ గా ఎన్నికై 30 నెలలు గడిచినా కనీసం ఒక కుళాయి కి ట్యాప్ కూడా వేయించలేకపోతున్నానని, ఏ పనీ చేయించలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక దశలో తనను తాను చెప్పుతో కొట్టుకుంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం లోనే తన సీట్లో కూర్చుని కన్నీరు మున్నీరు అవుతుండడంతో సహచర కార్పొరేటర్లు సముదాయించే ప్రయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో జరిగిన ఈ వ్యవహారం తాజా చర్చనీయాంశంగా మారింది.
రోడ్లను కూడా ఊడవడం లేదంటూ..
రామరాజు మాట్లాడుతూ తాను ఎన్నికైన 20వ వార్డు పరిధిలోకి వచ్చే గిరిజన గ్రామమైన తమ పరిధిలో మున్సిపల్ ఆక్టివిటీస్ ఏమి లేవని, కనీసం రోడ్లను శుభ్రం చేయడం, డ్రైనేజీలను నిర్వహించడం, వీధిలైట్లు వేయడం, అప్రోచ్ రోడ్లను నిర్మించడం లాంటి వాటిల్లో ఒక్కటి కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించారు. కనీసం రోజూ కాకపోయినా వారానికి ఒక్కసారైనా గ్రామాల్లోని ప్రధాన రహదారులైనా శుభ్రం చేయండని, డ్రైనేజీలలో పూడిక తీస్తే నీటి నిలువలు లేకుండా తద్వారా దోమలు ప్రబలకుండా అంటువ్యాధులు వ్యాపించకుండా ఉంటాయని, నెలకి రెండు సార్లైనా చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా ప్రయోజనం లేదంటూ ఆయన ఆవేశ పూరిత ప్రసంగం ఇచ్చారు. ఈ క్రమంలో తనని తాను నియంత్రించుకోలేక చెప్పుతో కొట్టుకున్నారు. బతకడం కంటే ఏమి చేయలేకపోతే చావడం మేలు అంటూ పేర్కొన్నారు. ఇంత నిస్సహాయ స్థితిలో ఉంటే మళ్ళీ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ కౌన్సిలర్లు అడ్డుకున్నారని..
అదే సమయంలో తాను మౌలిక మైన సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువస్తుంటే అధికార పార్టీ సభ్యులు సమస్యని డైవర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మరింత ఆగ్రహానికి గురయ్యారు. తాను ప్రస్తావిస్తున్న సమస్యల పట్ల కౌన్సిలర్ కమిషనర్ చైర్మన్ల చేత సమాధానం చెప్పించనీయకుండా అధికార పార్టీ కార్పొరేటర్లు అడ్డుకున్నారంటూ బాధను వ్యక్తం చేశారు. తమ సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావిస్తేనే వాటికి పరిష్కారం లభ్యం అవుతుందని అదేవిధంగా రికార్డులలో కూడా నమోదు అవుతుందని అలాంటి చోట కూడా అధికార పార్టీ సభ్యులు తమ ఆవేదనని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక దశలో మైకును విసిరేసి మౌనంగా కూర్చుండిపోయారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..