Bigg Boss 7: బిగ్‌బాస్‌లోకి బ్యాంకాక్ పిల్ల.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన శ్రావణి
బ్యాంకాక్ పిల్ల.. యూట్యూబ్ చూసేవారిలో చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది. బ్యాంకాక్‌లో ఉంటూ అక్కడి విషయాలను పంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో తన యాస. బాషాతో అందరిని ఆకట్టుకుంది. ఆమెనే శ్రావణి అలియాస్ బ్యాంకాక్ పిల్ల.

బ్యాంకాక్ పిల్ల.. యూట్యూబ్ చూసేవారిలో చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది. బ్యాంకాక్‌లో ఉంటూ అక్కడి విషయాలను పంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో తన యాస. బాషాతో అందరిని ఆకట్టుకుంది. ఆమెనే శ్రావణి అలియాస్ బ్యాంకాక్ పిల్ల. భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ వెళ్లి స్థిరపడిన శ్రావణి…తన సరదా కోసం బ్యాంకాక్ పిల్ల అనే పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. వ్లాగ్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే లక్షల్లో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. బ్యాంకాక్ లో ఉండే స్థితిగతులు, అక్కడి మార్కెట్, పర్యాటక ప్రదేశాలు, బ్యాంకాక్ ప్రజల జీవన విధానంపై తనదైన విజయనగరం యాసతో అందరికి దగ్గరైంది శ్రావణి. ప్రస్తుతం శ్రావణి నిర్వహిస్తున్న బ్యాంకాక్ పిల్ల ఛానెల్‌కు 20 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
అయితే బిగ్‌బాస్ షో గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు జరగబోయే ఈ షో కోసం నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. కుటుంబ సభ్యుల అభిప్రాయం తర్వాత నిర్ణయం చెబుతానని శ్రావణి నిర్వాహకులకు తేల్చి చెప్పింది. అయితే ఇటీవల ఫ్యామిలీతో శ్రావణి ఇండియాకు రావడంతో ఆమె బిగ్ బాస్ షో కోసమే ఇక్కడికి వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని శ్రావణి ఖండించకపోగా…ఆఫర్ వచ్చిన మాట నిజమే అని…ఇది తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. అయితే తాను బిగ్ బాస్ కి వెళ్లాలా లేదా అనే విషయంపై ఓసారి ఫ్యామిలీ మెంబెర్స్ తో చర్చించిన తర్వాత వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే బిగ్ బాస్ టీం వాళ్లు మరోసారి ఆమెను సంప్రదించారు. దీంతో ఆమె తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. మంచి ప్యాకేజీతో పాటు కొన్ని వెసులుబాటులకు అవకాశం ఇవ్వడంతో వెళ్ళాలా వద్ద అనే సందిగ్దతలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో తన నిర్ణయం తెలియజేస్తామని షో నిర్వాహకులకు చెప్పడంతో ఆమె తిరిగి నిర్ణయం మార్చుకుంటుందా అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
