AP News: మీ పిల్లలు జాగ్రత్త… పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ దిగింది..!
ఎందుకైనా మంచిది తల్లీ.. మీ పిల్లలను భద్రంగా చూసుకోండి. అనుమానాస్పద వ్యక్తులు మీ ప్రాంతాల్లో సంచరిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. కాకినాడ జిల్లాలో పిల్లల్ని అపహరించే గ్యాంగ్.. సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

కాకినాడ జిల్లా పత్తిపాడులో పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ కలకలం రేపింది. ఏలేశ్వరం మందుల కాలనీలో ఏప్రిల్ 11 రాత్రి కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించారు. ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను అపహరించేందుకు యత్నించగా గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. అతన్ని బంధించి.. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని.. స్థానికులు పోలీసులకు తెలిపారు.
కాలనీలో పిల్లల్ని ఎత్తుకెళ్ళే గ్యాంగ్ దిగారన్న ప్రచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రతిక్షణం బిడ్డల్ని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని.. ఎంక్వైరీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
