Kurnool: పాపం ఆ యాచకుడు 40 ఏల్లు భిక్షాటన చేసి 4 లక్షలు పోగేశాడు.. కానీ వారు ఒక్క రాత్రి వచ్చేసి..
అతను 40 ఏళ్ల నుంచి భిక్షాటన చేస్తూనే పొట్ట నింపుకుంటున్నాడు. ఎవరైనా పదో, పరకో ఇస్తే.. ఆ డబ్బును దాచిపెట్టుకునేవాడు. అలా అతడు 40 ఏళ్లల్లో దాచిన డబ్బుపై ఇద్దరు దుండగుల కన్ను పడింది. ఇంకేముంది అసలే వృద్ధుడు, కనీసం నడిచే పరిస్థితుల్లో కూడా లేదు.. దీంతో వన్ ఫైన్ నైట్ ఆ దుండుగులు అతడి సొమ్ము దొచేశారు.

కర్నూలులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుని జీవిస్తున్న వ్యక్తి డబ్బును అపహరించారు ఇద్దరు వ్యక్తులు. అనారోగ్యంతా బాధపడుతున్న ఆ యాచకుడు తన డబ్బు పోవడంతో లబోదిబోమన్నాడు. విషయం కొందరు గ్రామస్తులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక దర్గాలో ఉండే ఇద్దరు వ్యక్తులు తన డబ్బును అపహరించారని ఆ యాచకుడు తెలిపాడు. 40 ఏళ్లుగా భిక్షాటన చేసి సంపాదించుకున్న దాదాపు 4 లక్షల రూపాయలను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులు ముందు వాపోయాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాచకుడిని బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును తహశీల్దారుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
