Andhra Pradesh: క్యాష్ డిపాజిట్ మిషన్‌లో నకిలీ నోట్ల కలకలం.. షాకైపోయిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు..
శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకంరేపుతోంది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో నకిలీనోట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకంరేపుతోంది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో నకిలీనోట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే గత నెల 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాంక్ అకౌంట్‌కు రూ.44వేలు జమ చేశాడు. మొత్తం 88 రూ.500 నోట్లు ఉన్నాయి..కాని అవి నకిలీవని తేలడంతో మెషిన్‌లో ఓ పక్కన ఉన్నాయి.ఈ నెల 3న బ్యాంకు సిబ్బంది ఆ డిపాజిట్ మెషీన్ తెరిచారు..కాని అందులో నకిలీ నోట్లు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
వెంటనే ఈ విషయాన్ని మెనేజర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. ఆ తర్వాత టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నకిలీ కరెన్సీ నోట్లు ఎవరివి, వారి చేతికి ఎలా వచ్చిందనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తైన తర్వాత స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
అంతేకాదు గతంలో కూడా ఇలాంటి ఫేక్ నోట్లు ఇక్కడ బయటపడ్డాయి. ఓ వ్యక్తి టెక్కలి ప్రాంతంలో రూ.2000 నకిలీ నోట్లను ఒక మద్యం షాపు దగ్గర చెలామణీ చేయడం కలకలంరేపింది. అంతేకాదు కొంతమంది వ్యాపారుల వద్ద కూడా నకిలీ నోట్లు బయటపడ్డాయి. దఈ వ్యవహారంపై అప్పట్లోనే విచారణ చేశారు. కాని మళ్లీ ఇప్పుడు డిపాజిట్ మెషిన్‌లో దొంగ నోట్లు బయటపడటడం ఆందోళన కలిగిస్తోంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
