DC vs MI: ఫీల్డర్ల నుంచి వరుస తప్పిదాలు.. ఏమి అనలేక మౌనంగా ఉండిపోయిన హిట్‌మ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో..
మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఆటగాళ్ళ విషయంలో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ‘మీరేం ఫీల్డర్లురా బాబు..’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. తన అసహనాన్ని కళ్లకు కట్టినట్లు కనిపించేలా రియాక్ట్ అయ్యాడు. అవును, ఢిల్లీ బ్యాటింగ్ సమయంలో 14వ ఓవర్ సమయానికి క్రీజులో అక్షర్ పటేల్
మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 6 వికట్ల తేడాతో ఉత్కంఠబరిత విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత ముంబై అందుకున్న తొలి విజయం ఇది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఆటగాళ్ళ విషయంలో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ‘మీరేం ఫీల్డర్లురా బాబు..’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి మౌనంగా నలబడ్డాడు. అలాగే తన అసహనాన్ని కళ్లకు కట్టినట్లు కనిపించేలా రియాక్ట్ అయ్యాడు. అవును, ఢిల్లీ బ్యాటింగ్ సమయంలో 14వ ఓవర్ సమయానికి క్రీజులో అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇక తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ వేసిన ఈ ఓవర్‌లో అక్షర్ ఓ బౌండరీని కొట్టాడు.
అయితే అది సునాయసంగా ఆపవలసిన బౌండరీ. దానిని ఆపడంలో ముంబై ఫీల్డర్లు విఫలమయ్యారు. దీంతో తిలక్ వర్మ వైపు తిరిగి కోపంతో ఉన్న ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాడు రోహిత్ శర్మ. అలాగే ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ కొట్టిన రెండు క్యాచింగ్ షాట్‌లను పట్టుకోవడంలో సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. చేతిలోకి వచ్చిన బంతిని కూడా చేజార్చి సిక్సర్‌గా మార్చాడు సూర్య. దీంతో రోహిత్ తీవ్ర ఆగ్రహంతో ముఖంపై చేయి అడ్డుపెట్టుకున్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుస పరాజయాలతో అసహనంగా ఉన్న రోహిత్ ఇలా ప్రవర్తించాడని అర్థమవుతుంది.
— Main Dheet Hoon (@MainDheetHoon69) April 11, 2023
కాగా, ఈ మ్యాచ్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులకు ఆలౌటయింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్(47 బంతుల్లో 51), అక్షర్ పటేల్(24 బంతుల్లో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అలాగే ముంబై తరఫున బెహ్రెండార్ఫ్, పియూష్ చావ్లా మూడేసి వికెట్లతో రాణించగా.. రిలే మెరిడిత్ 2, హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 173 పరుగుల లక్షచేధనకు దిగిన ముంబైకి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని అందించారు. అయితే రోహిత్ అత్యుత్సాహంతో సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. ఇషాన్ కిషన్(31) రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కూడా 41 పరుగులతో మరోసారి రాణించి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలోనే రోహిత్ కూడా 65 పరుగులుచేసి వికెట్ కోల్పోయాడు. అయితే మిడిలార్డర్‌లో వచ్చిన టిమ్ డేవిడ్(13), కామెరూన్ గ్రీన్(17) నిలకడగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..