IPL 2023: ఎట్టకేలకు ముంబై ఖాతాలో తొలి విజయం.. ఉత్కంఠ పోరులో రాణించిన తెలుగు కుర్రాడు..

వరుస అపజయాలతో ఐపీఎల్ 16 సీజన్‌ని ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఉత్కంఠబరితమైన తొలి విజయం సాధించింది. వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిన ముంబై.. ఎట్టకేలకు ఢిల్లీ వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై 6 వికెట్ల తేడాతో విజయ పతకాన్ని..

IPL 2023: ఎట్టకేలకు ముంబై ఖాతాలో తొలి విజయం.. ఉత్కంఠ పోరులో రాణించిన తెలుగు కుర్రాడు..
Mumbai Indians Defeated Delhi Capitals By 6 Wickets
Follow us

|

Updated on: Apr 12, 2023 | 12:00 AM

IPL 2023: వరుస అపజయాలతో ఐపీఎల్ 16 సీజన్‌ని ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఉత్కంఠబరితమైన తొలి విజయం సాధించింది. వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిన ముంబై.. ఎట్టకేలకు ఢిల్లీ వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై 6 వికెట్ల తేడాతో విజయ పతకాన్ని ఎగరేసింది. ఇక ముంబై తరఫున హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా దాదాపు 22 ఐపీఎల్ ఇన్నింగ్స్ తర్వాత టోర్నీలో 41వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే తెలుగు ఆటగాడు తిలక్ వర్మ(41) కూడా మరోసారి రాణించారు. ఇక చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్లు కూడా తమదైన పాత్ర పోషించారు.

అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఢిల్లీ తరఫున ఓపెనర్‌గా వచ్చిన డేవిడ్ వార్నర్ 51 పరుగులతో 57వ ఐపీఎల్ అర్థ శతకాన్ని, అలాగే అక్షర్ పటేల్ కూడా తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని సాధించారు. అయితే వార్నర్‌తో పాటు వచ్చిన ఫృద్వీ షా 15 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం వచ్చిన మనిష్ పాండే 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆపై వచ్చిన యష్ దుల్(2), రోవ్‌మన్ పావెల్(4), లలిత్ యాదవ్(2) పరుగులతో పెవిలియన్ చేరారు. అనంతరం వచ్చిన అక్షర్ 25 బంతుల్లోనే 54 పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం వార్నర్ కూడా 51 పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా వికట్ కోల్పోయాడు. ఆపై వచ్చినవారు కూడా పెద్దగా రాణించకపోగా.. వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో టీమ్ టోటల్ స్కోర్ 172 చేరింది. ఇక ముంబై తరఫున బెహ్రండర్ఫ్, చావ్లా చెరో 3, రిలే మెరిడిత్ 2, హృతిక్ షోకిన్ ఒక వికట్ పడగొట్టారు

ఇవి కూడా చదవండి

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై చివరి బంతికి రెండు పరుగులు సాధించి ఉత్కంఠబరితమైన రీతిలో తొలి విజయాన్ని సాధించింది. ఇక ముంబై తరఫున ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ టీమ్‌కి శుభారంభం అందించారు. అయితే 7.3 ఓవర్లలో 71 పరుగుల ముంబై స్కోర్ వద్ద ఇషాన్‌(31)ని రనౌట్ చేసి ఈ ద్వయాన్ని ఢిల్లీ ఫీల్డర్లు విడదీశారు. అయితే అనంతరం రోహిత్‌తో జతకలిసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 29 బంతుల్లో 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆపై వచ్చిన సూర్య కుమార్ యాదవ్(0) మరోసారి నిరాశపరిచాడు. ఆ వెంటనే రోహిత్ కూడా 65 పరుగులతో వెనుదిరిగాడు. అయితే మిడిలార్డర్ ఆటగాళ్లుగా క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ 13, కామెరూన్ గ్రీన్ 17 పరుగులతో అజేయంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరి బంతికి 2 పరుగుల చేయాల్సిన సందర్భంలో ఆ బంతిన ఆడిన టిమ్ డేవిడ్ 2 పరుగుల చేయడంతో ముంబై విజయాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..