AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇలా ఉన్నారేంట్రా..! ప్రేమతో నెంబర్ ఇచ్చిన యువతి.. ఆపై యువకుడు ఏం చేశాడో తెలిస్తే మతి పోవాల్సిందే..

ఈ రోజుల్లో లవర్ కోసం యువతీయువకులు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఇలా ప్రయత్నాలు చేస్తున్నవారికి ఎవరైనా స్వయంగా వచ్చి ‘హాయ్’ చెప్పినా, ఫోన్ నంబర్ ఇచ్చినా ఇక అదృష్టమే. అంతేనా కోతికి కొబ్బరి చిప్ప దొరికిందే తీరు అన్నట్లుగా తెగ..

Watch Video: ఇలా ఉన్నారేంట్రా..! ప్రేమతో నెంబర్ ఇచ్చిన యువతి.. ఆపై యువకుడు ఏం చేశాడో తెలిస్తే మతి పోవాల్సిందే..
Fubby Scene Visuals
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 11, 2023 | 6:15 AM

Share

ఈ రోజుల్లో లవర్ కోసం యువతీయువకులు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఇలా ప్రయత్నాలు చేస్తున్నవారికి ఎవరైనా స్వయంగా వచ్చి ‘హాయ్’ చెప్పినా, ఫోన్ నంబర్ ఇచ్చినా ఇక అదృష్టమే. అంతేనా కోతికి కొబ్బరి చిప్ప దొరికిందే తీరు అన్నట్లుగా తెగ మురిసిపోతుంటారు. ఇక ఇలా అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు పడే పాట్ల గురించి అనేక వీడియోలు సోషల్ మీడిమాలో కూడా అనేకం వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అందుకు భిన్నమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలోని యువకుడు చేసిన పనికి నెటిజన్లు తల బాదుకుంటున్నారు. ‘స్వయంగా అమ్మాయి నంబర్ ఇస్తే ఇలా చేశాడేంటి..?’ అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.

అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువతి తన తండ్రితో కలిసి స్కూటీపై కాలేజీకి వెళ్తుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడిని చూసి, హాయ్ చెప్పి తన నంబర్ రాసి అతనికిి ఇస్తుంది. అయితే అతను ఆ నంబర్‌ తీసుకుని, వెంటనే ఆ యువతి తండ్రి బండి ఆపుతాడు. తర్వాత జరిగిన విషయం అయనకు వివరిస్తాడు. దీంతో ఆ తండ్రి తన కూతురుని కొడతాడు. ఇలా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట  చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

ఇక ఈ వైరల్ వీడియోకి ఇప్పటివరకు లక్షా 25 వేల లైకులు, 24 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా అనేక మంది నెటిజన్లు వీడియోపై స్పందించి కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ‘అయ్యిందా.. బాగా అయ్యిందా..?’ అని, మరికొందరు ‘పాపం అమాయకురాలు.., మూర్ఖుడికి నంబర్ ఇచ్చింద’ని రాసుకొస్తున్నారు. ఇంకొందరు అయితే ఫన్నీ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు