AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అలా ఎలా సాధ్యం..? మేతకు వెళ్లిన గేదెలకు అటెండెన్స్.. ఉన్నానంటూ చెబుతున్న పశువులు..

సాధారణంగా స్కూల్ మొదలుకొని ఉద్యోగం చేసే ఆఫీసు వరకు అన్ని చోట్ల అటెండెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకుంటారు. ఒక చోట పేర్లు పిలిచి తీసుకుంటే, మరోచోట బయోమెట్రిక్ ద్వారా జరుగుతుంది. అలాగే మేత మేయడం కోసం పొలానికి వెళ్లిన గెదేలు, ఎద్దులు వంటి జంతువులనైతే వాటిని లెక్కపెట్టి..

Watch Video: అలా ఎలా సాధ్యం..? మేతకు వెళ్లిన గేదెలకు అటెండెన్స్.. ఉన్నానంటూ చెబుతున్న పశువులు..
Man Taking Attendance Of Buffaloes
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 11, 2023 | 5:47 AM

Share

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక వాటిలో చాలా వరకు మన ఇంటి చుట్టు పక్కల జరిగే సన్నివేశాలనే పోలి ఉంటాయి. సాధారణంగా స్కూల్ మొదలుకొని ఉద్యోగం చేసే ఆఫీసు వరకు అన్ని చోట్ల అటెండెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకుంటారు. ఒక చోట పేర్లు పిలిచి తీసుకుంటే, మరోచోట బయోమెట్రిక్ ద్వారా జరుగుతుంది. అలాగే మేత మేయడం కోసం పొలానికి వెళ్లిన గెదేలు, ఎద్దులు వంటి జంతువులనైతే వాటిని లెక్కపెట్టి, లేదా వాటిని గుర్తుపెట్టుకుని అన్నీతిరిగి ఇంటికి వచ్చాయో లేదో చూస్తారు. కానీ వాటికంటూ పేర్లు పెట్టి పిలవడం, అవి వచ్చానంటూ అరవడం అనేది జరగదు కదా.. అలా చేయడానికి అవి మాట్లాడలేవు. అయితే స్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.  ఆ వీడియోలో ఓ వ్యక్తి తన గేదెలకు అటెండెన్స్ తీసుకుంటున్నాడు.

అయితే అందుకు అవి కూడా అక్కడే ఉన్నానన్నట్లుగా అరిచి, చెబుతున్నాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇదేం వీడియోరా బాబు అనుకుంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి అచ్చం క్లాస్ టీచర్ మాదిరిగానే తన పశువులకు కూడా అటెండెన్స్ తీసుకున్నాడు. ‘మంగ, లక్ష్మీ, రాములమ్య, నర్సయ్య, కోటేశ్వరావు, రాణి, అమ్ము, అందరు వచ్చిర్రుగా.. ఇంటికి నడవండి’ అంటూ పశువుల అటెండెన్స్ తీసుకుని వాటిని పిలుస్తున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమయింది. దీంతో అది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి..

ఇక ఈ వీడియోకు 3 లక్షల 30 వేల లైకులు, 40 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.  ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు వీడియోపై స్పందించి, కామెంట్ చేస్తున్నారు. ఇక వారిలో ఒక నెటిజన్ అయితే ‘అంతమంది అమ్మాయిల మధ్య ఇద్దరు అబ్బాయిలేనా.. ఇలా అయితే ఎలా’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇంకా చాలా మంది వారి వారి స్నేహితులకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసి ‘చిన్నప్పుడు నీకు ఇలాగే అటెండెన్స్ తీసుకున్నారా..’ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోను అనేక మంది నెటిజన్లు షేర్ కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రీల్స్‌ మోజుతో రైలు పట్టాలపై విన్యాసాలు! కట్‌చేస్తే మొండి చేతులతో
రీల్స్‌ మోజుతో రైలు పట్టాలపై విన్యాసాలు! కట్‌చేస్తే మొండి చేతులతో
బంగారం ధరలు రికార్డు స్థాయికి..పాత బంగారాన్ని అమ్మేస్తున్న ప్రజలు
బంగారం ధరలు రికార్డు స్థాయికి..పాత బంగారాన్ని అమ్మేస్తున్న ప్రజలు
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొత్తిమీర వీరికి విషంతో సమానం..
ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొత్తిమీర వీరికి విషంతో సమానం..
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే
పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే