IPL 20023, RCB: ‘ధోని ముద్దు, కార్తిక్ వద్దు’.. ఆర్‌సీబీ వికెట్ కీపర్‌కి టీమ్ ఫ్యాన్స్ చురకలు.. అసలు ఏం జరిగిందంటే..?

ఆర్‌సీబీ ఖాతాలో వరుసగా రెండో ఓటమి చేరింది. ఫలితంగా ఫ్రస్ట్రేట్ అయిన ఆర్‌సీబీ ఫ్యాన్స్, నెటిజన్లు ‘మాకు ఎంఎస్ ధోని కావాలి’ అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. అందుకు తగిన కారణం కూడా లేకపోలేదు.  అవును, లక్నో లక్ష్య చేధనలో భాగంగా 19వ ఓవర్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి..

IPL 20023, RCB: ‘ధోని ముద్దు, కార్తిక్ వద్దు’.. ఆర్‌సీబీ వికెట్ కీపర్‌కి టీమ్ ఫ్యాన్స్ చురకలు.. అసలు ఏం జరిగిందంటే..?
Csk's Ms Dhoni; Rcb's Dinesh Karthik
Follow us

|

Updated on: Apr 11, 2023 | 6:55 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 15 సీజన్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ చివరి బంతికి ఒక పరుగు తీసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వికెట్ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. లక్నో 9 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఆర్‌సీబీ ఖాతాలో వరుసగా రెండో ఓటమి చేరింది. ఫలితంగా ఫ్రస్ట్రేట్ అయిన ఆర్‌సీబీ ఫ్యాన్స్, నెటిజన్లు ‘మాకు ఎంఎస్ ధోని కావాలి’, ‘ధోని ముద్దు, కార్తిక్ వద్దు’ అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. అందుకు తగిన కారణం కూడా లేకపోలేదు.  అవును, లక్నో లక్ష్య చేధనలో భాగంగా 19వ ఓవర్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి క్రీజులో ఉంది. చివరి ఓవర్ వేయడానికి వచ్చిన హర్షల్ పటేల్ మొదటి బంతికి ఒక పరుగు ఇచ్చాడు. ఆ తర్వాత వేసిన రెండో బంతికి వికెట్(మార్క్ వుడ్) తీసి, మూడో బంతికి 2.. నాల్గో బంతికి 1 పరుగు ఇచ్చాడు.

అంటే లక్నో విజయం కోసం రెండు బంతుల్లో 1 పరుగు మాత్రమే కావాలి. క్రీజులో టెయిలెండర్లే ఉన్నారు కాబట్టి మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం. ఈ క్రమంలో హర్షల్ పటేల్ వేసిన ఐదో బంతిని గాల్లోకి కొట్టిన లక్నో బ్యాటర్ ఉనాద్కట్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతే మ్యాచ్ డ్రా అనుకున్నారు అంతా కూడా. అయితే చివరి బంతి ఆడిన ఆవేష్ ఖాన్ పరుగు తీయలేకపోయాడు. అయితే నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లోని రవి బిష్ణోయ్‌ మెరుపు వేగంతో బైరన్ కోసం పరుగు తీశాడు. అయితే ఈ క్రమంలో అతన్ని దినేశ్ కార్తిక్ రనౌట్ చేయలేకపోయాడు. డీకే బంతిని అందుకోవడంలో ఆలస్యం కావడం, లక్నో టెయిలెండర్లు వేగంగా పరుగు తీయడం వల్ల ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో ఆర్‌సీబీ కీపర్‌పై ఆ టీమ్ అభిమానులు కోపగించుకుంటున్నారు. అంతేకాక ‘మాకు ఎంఎస్ ధోని కావాలి, డీకే కాదు’ అంటూ మీమ్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలా నెట్టింట ట్రెండ్ అవుతున్న టాప్ మీమ్స్..

కాగా, ముంబై ఇండియన్స్‌పై మొదటి మ్యాచ్ గెలిచిన ఆర్‌సీబీ వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో, తాజాగా లక్నో టీమ్‌పై ఒక వికెట్ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..