Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20-IPL Cricket: మనల్ని ఎవడ్రా ఆపేది..! కింగ్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత.. ఫించ్‌ని దాటేసి ‘పొట్టి క్రికెట్’ స్టారర్‌గా..

ముందు బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ తరఫున ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అలాగే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీకి ఇది రెండో అర్ధ శతకం కూడా. ఈ క్రమంలో 4 సిక్సర్లు కొట్టిన కోహ్లి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన 5వ ఆటగాడిగా..

T20-IPL Cricket: మనల్ని ఎవడ్రా ఆపేది..! కింగ్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత.. ఫించ్‌ని దాటేసి ‘పొట్టి క్రికెట్’ స్టారర్‌గా..
Virat Kohli
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 11, 2023 | 6:45 AM

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠబరిత మ్యాచ్‌లో హోమ్‌టీమ్‌పై లక్నో చివరి బంతితో ఒక వికట్‌తో విజయం సాధించింది. అయితే ముందు బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ తరఫున ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అలాగే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీకి ఇది రెండో అర్ధ శతకం కూడా. ఈ క్రమంలో 4 సిక్సర్లు కొట్టిన కోహ్లి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన 5వ ఆటగాడి(227 సిక్సర్లు)గా అవతరించాడు. నిజానికి ఈ స్థానంలో అంతకముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్(223 సిక్సర్లు) ఉండేవారు. అంతేకాక ఈ 61 పరుగుల ఇన్నింగ్స్‌తో కోహ్లీ మరో ఘనతను కూడా అందుకున్నాడు.

అవును, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న కోహ్లీ.. టీ20 ఫార్మాట్‌లో నాల్గో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌కి ముందు కోహ్లీ 11,368 పరుగులతో టీ20 టాప్ స్కోరర్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే ఆరోన్ ఫించ్ 11392 పరుగులతో నాల్గో స్థానంలో ఉండేవాడు. అయితే కోహ్లీ లక్నో టీమ్‌పై చేసిన 61 పరుగులతో ఆరోన్‌ ఫించ్‌ని అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీకి టీ20 ఫార్మాట్‌లో టోటల్ స్కోర్ 11429.

ఇవి కూడా చదవండి

కాగా, టీ20 ఫార్మాట్‌లో టాప్ 5వ లిస్టులో ఎవరెవరున్నారంటే..

  1. క్రిస్ గేల్ – 14562 (455 ఇన్నింగ్స్)
  2. షోయబ్ మాలిక్ – 12528 (474 ఇన్నింగ్స్)
  3. కీరన్ పొలార్డ్ – 12175 (555 ఇన్నింగ్స్)
  4. విరాట్ కోహ్లీ – 11429 (345 ఇన్నింగ్స్)
  5.  ఆరోన్ ఫించ్ – 11392 (376 ఇన్నింగ్స్)

కాగా, విరాట్ కోహ్లీ 164 పరుగులతో ఐపీఎల్ 16వ సీజన్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌పై అజేయంగా 82, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 21, అలాగే లక్నో సూపర్ జెయింట్‌పై 61 పరుగులను చేశాడు. మరోవైపు భారత్ తరఫున 107 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 4008 పరుగులు, 218 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 6788 పరుగులు సాధించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..