రెండు రోజుల క్రితం ముంబై వాంఖడే స్టేడియంలో హోమ్‌టీమ్‌పై అజింక్య రహానే కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్ 16వ సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్థ శతకం. అయితే ఈ రోజు బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ కేవలం 15 బంతుల్లోనే..
RCB vs LSG: ఐపీఎల్ 2023లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డు కేవలం 48 గంటల్లో బద్దలైంది. రెండు రోజుల క్రితం ముంబై వాంఖడే స్టేడియంలో హోమ్‌టీమ్‌పై అజింక్య రహానే కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్ 16వ సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్థ శతకం. అయితే ఈ రోజు బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఫలితంగా రహానే పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సంచరీ రికార్డు కేవలం 48 గంటల్లోనే బద్దలయింది. అంతేకాక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో హాఫ్ సెంచరీగా కూడా పూరన్ ఇన్నింగ్స్ నిలిచింది. అలాగే పూరన్ కంటే ముందు యూసఫ్ పటాన్ సునీల్ నరైన్ కూడా 15 బంతుల్లోనే ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నారు.
అయితే ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్థ శతకం రికార్డు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరిట ఉంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాహుల్ కేవలం 14 బంతులలోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అలాగే గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో పాట్ కమ్మిన్స్ కూడా ముంబై ఇండియన్స్‌పై 14 బంతులలోనే హాఫ్ సెంచరీ చేసి, రాహుల్ రికార్డును సమం చేశాడు.