AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పద్ధతి ముఖ్యం..! అందంగా ముగ్గులేస్తున్న వయ్యారి.. ‘ఏ ఇంటి కోడలో’ అంటున్న నెటిజన్లు..

ఈ రోజుల్లో ఏ పండుగకో, శుభకార్యం సందర్భంగానో మాత్రమే పిండితో ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ముగ్గుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో ముగ్గు వేస్తున్నవాళ్ల శ్రద్ధాసక్తులు

Watch Video: పద్ధతి ముఖ్యం..! అందంగా ముగ్గులేస్తున్న వయ్యారి.. ‘ఏ ఇంటి కోడలో’ అంటున్న నెటిజన్లు..
Monkey Drawing Rangoli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 10, 2023 | 6:28 AM

Share

ఇప్పటికాలంలో ఆర్టిఫిషియల్‌గా ముగ్గులను పెయింట్ వేస్తున్నారు కానీ ఒకప్పుడు ఉదయాన్నే లేచి ముగ్గులు వేసేవారు మగువలు. మధ్యాహ్నానికి చెరిగిపోయే ముగ్గే కదా అని అనుకోకుండా.. పొద్దుపొద్దున్నే చెమటోడ్చి ముగ్గులేసేవారు. ఇక ఈ రోజుల్లో అయితే ఏ పండుగకో, శుభకార్యం సందర్భంగానో మాత్రమే పిండితో ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ముగ్గుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో ముగ్గు వేస్తున్నవాళ్ల శ్రద్ధాసక్తులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేనా ‘ఏ ఇంటి కోడలు అవుతుందో..’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. అసలు ఆ వీడియోలో ఏముందో తెలిస్తే ఇది నిజమేనా..? ఇది ఎలా సాధ్యం..? అని మీరే ఆశ్చర్యంగా ప్రశ్నించుకుంటారు.

అసలు ఆ వీడియోలలో ఏముందంటే.. ఓ కోతి తన చేతిలో ఉన్న సుద్ద ముక్కతో నేలపై రీతలు గీస్తుంది. అది కూడా ముగ్గు వేసినట్లు గుండ్రని గీతలు. ఈ క్రమంలో ఆ కోతి ఎంతో వయ్యారంగా తన నడుము తిప్పుతూ ముగ్గు గీతలు గీస్తుంది. ఆ సన్నివేశం పార్కులో జరిగిందని తెలుస్తున్నప్పటికీ.. ఎక్కడ, ఏ పార్కులో జరిగిందో తెలియరాలేదు. అయితే ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ వీడియోకి ఇప్పటివరకు 13 లక్షలకు పైగా లైకులు, 1.5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ‘జై శ్రీరాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా మరికొందరు ‘ఎంత అందంగా ముగ్గు వేస్తుందో ఈ వయ్యారి.. నాకు కొడుకు లేడు కానీ ఉండే ఇదే నా కోడలు’ అని, ‘పక్కన ఖాళీగా ఫ్రెండ్ తిరుగుతుంది ముగ్గు లో రంగులు నింపమని చెప్పు’ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Follow Us
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..