Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మెరుగైన కంటిచూపు కోసం తినాల్సిన నట్స్ ఇవే.. తింటే బరువు తగ్గడం కూడా ఖాయం..

మనలో చాలా మంది ఫిట్‌నెస్, వంటల కోసం జీడిపప్పును ఉపయోగిస్తుంటారు. నిజానికి జీడిపప్పుతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ పప్పులను వంటకాలలో విరివిగా వాడుతుంటారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఈ డ్రైనట్స్‌లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా..

Health Tips: మెరుగైన కంటిచూపు కోసం తినాల్సిన నట్స్ ఇవే.. తింటే బరువు తగ్గడం కూడా ఖాయం..
Eyecare
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 10, 2023 | 6:51 AM

Cashew Benefits: మనలో చాలా మంది ఫిట్‌నెస్, వంటల కోసం జీడిపప్పును ఉపయోగిస్తుంటారు. నిజానికి జీడిపప్పుతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ పప్పులను వంటకాలలో విరివిగా వాడుతుంటారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఈ డ్రైనట్స్‌లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలు మన నుంచి దూరమవుతాయి. అలాగే కంటిచూపుని కూడా మెరుగుపరిచేశక్తి ఈ జీడిపప్పులకు ఉంటుంది. అలాగే ఇది చర్మ సంరక్షణలో కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఇంకా జీడిపప్పులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కంటిచూపు: జీడిపప్పు కంటి చూపుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే లుటిన్, జియాక్సంథిన్, ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ల అధిక సాంద్రత మన కళ్లను దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు UV ఫిల్టర్‌గా పని చేయడం ద్వారా సూర్య కిరణాల నుంచి కూడా మీ కళ్ళను రక్షిస్తుంది.

క్యాన్సర్‌ నిరోధిని: క్యాన్సర్‌ను నివారించడంలో కూడా జీడిపప్పు సహాయపడుతుంది. జీడిపప్పులో ప్రోయాంతోసైనిడిన్స్ పుష్కలంగా ఉన్నందున ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు పునరావృతం కాకుండా నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడం: క్రమం తప్పకుండా జీడిపప్పును తినడం ద్వారా అనతి కాలంలోనే బరువు తగ్గవచ్చు. అవును, ఇందులో ఉండే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు జీవక్రియను వేగవంతం చేయడానికి, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. తద్వారా మీరు వెంటనే బరువు తగ్గుతారు.

మైగ్రేన్ సమస్య: జీడిపప్పులో ఉండే మెగ్నీషియం మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల తలనొప్పి, మైగ్రేన్, నరాల బలహీనత వంటి వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే జీడిపప్పును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ శరీరంలోని మెగ్నీషియం లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఫలితంగా మీకు మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

చర్మ సంరక్షణ: జీడిపప్పును నిత్యం తింటే కాంతివంతమైన చర్మం మీ సొంతం. ఎందుకంటే జీడిపప్పులో రాగి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున అవి మీ చర్మాని మెరిసేలా చేస్తాయి. జీడిపప్పు నూనెలో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీ చర్మానికి మంచిది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..