Diabetes Diet Plan: షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. మీ డైట్‌లో వీటిని చేర్చుకుంటే మీ సమస్య ఫసక్..
తెలిసీ తెలియక తీసుకున్న ఆహారం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి ఆహార విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా పిండి పదార్థాలను తినడం వల్ల షుగర్ సమస్య అదుపులో ఉంటుంది.

మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. ముఖ్యంగా షుగర్ సమస్య అందరినీ పట్టి పీడిస్తుంది. షుగర్ సమస్య ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే తెలిసీ తెలియక తీసుకున్న ఆహారం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి ఆహార విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా పిండి పదార్థాలను తినడం వల్ల షుగర్ సమస్య అదుపులో ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు వేధించవు. ముఖ్యంగా ఓ ఐదు రకాల పిండి పదర్థాలు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే షుగర్ సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార నిపుణులు సూచించే ఆ పిండిపదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
- ఉసిరి పిండి: ఈ పిండిలో అధిక మొత్తంలో మాంగనీస్ ఉంటుంది. అందువల్ల గ్లూకోనోజెనిసిస్ సమయంలో మాంగనీస్ సహాయపడుతుంది. మాంగనీస్ శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మంచి ఎంపికగా వైద్యులు సూచిస్తారు. కాబట్టి ఉసిరికాయను ఇలా తీసుకోవడం ద్వారా తగినంత మొత్తంలో మాంగనీస్ శరీరానికి అంది షుగర్ అదుపులో ఉంటుంది.
- రాగి పిండి: ఈ పిండిలో పాలీఫెనాల్స్, అమినో యాసిడ్స్, డైటరీ ఫైబర్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పిండిని మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యరోగ నివారిణిగా పరిగణిస్తారు. ఆహార కోరికలను రాగులు తగ్గిస్తాయని చాలామంది వాదన. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యను కూడా నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- బార్లీ: తృణధాన్యాల బార్లీ ఫైబర్‌కు మంచి మూలం. ఇందులో కరిగే ఫైబర్ బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థలో సక్రమంగా చేసి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అలాగే బార్లీలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర శాతం పెరగదని నిపుణులు పేర్కొంటున్నారు.
- బాదం పిండి: మెత్తగా రుబ్బిన బాదం గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్, ఫైబర్, గుండె ఆరోగ్యాన్ని ఇచ్చే కొవ్వు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి ఇది కూడా తక్కువ గ్లైసెమిక్‌కు సూచికగా ఉంటుంది. ఇందులో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అనే పోషకాన్ని కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.



(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..