AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Home Remedies: ఈ మొక్క మధుమేహానికి దివ్యౌషధం.. వీటి ఆకులను జ్యూస్ చేసుకుని తాగితే చాలు.. అంతా కంట్రోల్..

మీరు డయబెటిస్‌ను కంట్రోల్ చేసుకునే టిప్స్ కోసం చూస్తున్నారా.. ఈ కథనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే.. కొన్ని మొక్కలు మీ రక్తంలో షుగర్ లేవల్స్‌ను అదుపులో ఉంచేందుకు సాహాయపడుతాయి. ఈ ఆకులు మధుమేహంతో సహా అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది.

Diabetes Home Remedies: ఈ మొక్క మధుమేహానికి దివ్యౌషధం.. వీటి ఆకులను జ్యూస్ చేసుకుని తాగితే చాలు.. అంతా కంట్రోల్..
Pandan Leaves
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 14, 2022 | 9:36 AM

పాండన్ పేరు మీరు చాలా అరుదుగానే విని ఉండరు. కానీ ఈ మొక్కలు మీ చుట్టుపక్కల కనిపిస్తారు. కానీ ఆ మొక్కను పాండన్ అంటారని మీకు తెలిసి ఉండక పోవచ్చు. పాండన్ మొక్కను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తుంటారు. పాండన్ ఆకులను బచ్చలికూర వలె పప్పుల్లో వాడుతారు. పాండన్ ఆకులతో పకోడాలు, వంటల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇది వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని కారణంగా ఇది అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది. అయితే డయాబెటిస్ బాధితులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

పాండన్ మొక్క..

పాండన్ మొక్క శాస్త్రీయ నామం పాండనస్ అమరిల్లిఫోలియస్. పాండన్ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బీటా కెరోటిన్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ పాండన్ మొక్కలో గణనీయమైన మొత్తంలో కనిపిస్తాయి.

మధుమేహ బాధితులకు ప్రయోజనకారిగా..

బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం వారి పరిశోధన ప్రకారం.. పాండన్ ఆకులతో చక్కెరను నియంత్రించవచ్చుని తేలింది. పాండాన్‌లో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుందని వారు వెల్లడించారు. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని వారి పరిశోధనలో పేర్కొన్నారు.

ఎలా ఉపయోగించాలి..

మీరు పాండన్ ఆకుల రసం, పొడి లేదా రసం తాగితే.. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఈ మొక్కల ఆకులతో జ్యూస్ కూడా తయారు చేయడం చాలా సులభం. ఈ జ్యూస్ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మీరు కూడా ప్రతిరోజూ పాండన్ ఆకులతో చేసిన జ్యూస్ తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్యూస్ చేయడానికి, 5-6 ఆకులను కడిగి.. అరకప్పు నీరు వేసి మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసాన్ని ఫిల్టర్ చేసి ఆకులను వేరు చేయండి. వడకట్టిన రసంలో నీరు కలుపుకుని తాగితే సరి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..