AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits for Diabetes: షుగర్ పేషంట్లూ ఆ పండ్ల జోలికి అస్సలు వెళ్లకండి! ఇవిగో వివరాలు..

మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తులు తమ రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడానికి వెనుకాడతారు. ఎందుకంటే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయనే భయం. వారి భయం కొంత వరకూ  నిజమే అయినా..

Fruits for Diabetes: షుగర్ పేషంట్లూ ఆ పండ్ల జోలికి అస్సలు వెళ్లకండి! ఇవిగో వివరాలు..
Fruits For Diabetics
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2023 | 6:43 PM

సైలెంట్ కిల్లర్ గా పేరుపొందిన చక్కెర వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే తిరిగి పోదు. జీవితాంతం దానిని అదుపుచేసుకునేందుకు సరైన డైట్ మెయింటేన్ చేయడంతో పాటు మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాల్సిందే. కొంతమంది దీనికి భయపడి స్ట్రిక్ డైట్ పేరుతో ఆరోగ్యానికి మంచి చేసే ఆహార పదార్థాలను కూడా పూర్తిగా దూరం పెట్టేస్తారు. వాటిల్లో ముందు వరుసలో ఉండేది పండ్లు. అవును నిజమే.. మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తులు తమ రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడానికి వెనుకాడతారు. ఎందుకంటే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయనే భయం. వారి భయం కొంత వరకూ  నిజమే అయినా.. పూర్తిగా అన్ని పండ్లు మానేయడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పండ్ల ద్వారా ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి అందుతాయ. వాటని పూర్తిగా దూరం పెట్టడం వల్ల ఇవన్నీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో మధుమేహ రోగులు ఏ పండ్లు తీసుకుంటే మేలు.. అవి ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏ పండ్లు అసలు తినకూడదు? వంటి అంశాలపై ప్రముఖ న్యూట్రీషినిస్టులు చెబుతున్న సూచనలు తెలుసుకుందాం..

కొన్ని మంచివి.. మరికొన్ని కాదు..

మధుమేహం ఉన్న వారికి కొన్ని పండ్లు మంచిది.. మరికొన్ని పండ్లు కావు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతి పండు దాని స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఏ పండునైనా రోజూ, వారానికో లేదా కాలానుగుణంగానో తినాలి. సాధారణంగా పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉంటుంది. ఇది అధికంగా ఉండే పండ్లు చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే ఈ జీఐ అధికంగా ఉన్న పండ్లను తగ్గించి తీసుకోవాలి. ప్రతిరోజూ 150-200 గ్రాముల పండ్లను తీసుకోవచ్చు. అయితే మీ చక్కెర స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే, ఈ పరిమాణం రోజుకు 100 నుంచి 150 గ్రాములకు తగ్గించుకోవాలి.

ఇది గుర్తుంచుకోవాలి..

అలాగే డయాబెటిక్ రోగులు అల్పాహారం, భోజనం, రాత్రి భోజనంతో పాటు పండ్లను కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే సాధారణంగా మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పండ్లలో కూడా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. పండ్లను మధ్యాహ్న సమయంలో తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు అప్పడప్పుడు వేరుశనగ, పనీర్ వంటి గింజలను కలిపి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రసం వద్దు.. పండ్లే ముద్దు..

డయాబెటిస్ రోగులు పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. పచ్చి పండ్లను మాత్రమే తీసుకోవాలి. రసాల ద్వారా చక్కెర స్థాయిలో రాపిడ్ గా పెరుగుతాయి.

ఈ పండ్లు మంచిది..

మధుమేహం ఉన్నవారు ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి పుచ్చకాయలు తీసుకోవచ్చు. మెటబాలిక్ డిజార్డర్‌ను నిర్వహించడానికి ఈ పండ్లు అత్యుత్తమం అని నిపుణులు వివరిస్తున్నారు. ఈ పండ్లలో సహజంగా కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తగినంతగా తీసుకుంటే ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి.

ఇవి తినకపోవడం మంచిది..

మామిడి, జాక్ ఫ్రూట్స్, అరటి, చికూ, ద్రాక్ష వంటివి తినకపోవడం మంచిది. లేదంటే తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. ఈ పండ్లు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..