Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చీరకట్టుతో 15వేల మంది.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. గుజరాత్‌లో సూరత్‌ శారీ వాకథాన్‌

ఏ సమయంలో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో చీరదే మొదటి స్థానం. ఎంతటి వారైనా పెళ్లి సమయంలో చీర చుట్టాల్సిందే. అంతటి ప్రాధాన్యత కలిగిన చీరలను ధరించి తొలిసారిగా సూరత్‌లో శారీ వాకథాన్‌ నిర్వహించారు.

Viral Video: చీరకట్టుతో 15వేల మంది.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. గుజరాత్‌లో సూరత్‌ శారీ వాకథాన్‌
Surat Saree Walkathon
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2023 | 11:47 AM

భారతీయ సంప్రదాయంలో చీరకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. చీరలు స్త్రీలకు ఎంతో హుందాతనాన్ని తీసుకొస్తాయి. ఎన్ని రకాల దుస్తులు ధరించినా చీర ప్రత్యేకతే వేరు. ఏ సమయంలో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో చీరదే మొదటి స్థానం. ఎంతటి వారైనా పెళ్లి సమయంలో చీర చుట్టాల్సిందే. అంతటి ప్రాధాన్యత కలిగిన చీరలను ధరించి తొలిసారిగా సూరత్‌లో శారీ వాకథాన్‌ నిర్వహించారు. ఇందులో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 వేలమంది మహిళలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

గుజరాత్ సూరత్‌లో మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో ఏప్రిల్‌ 9న ‘శారీ వాకథాన్’ నిర్వహించారు. మహిళలల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందకు దేశంలోనే తొలిసారిగా ఈ వాకథాన్‌ నిర్వహించారు. దాదాపు 3 కిలో మీటర్లు సాగిన ఈ వాకథాన్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర జౌళి, రైల్వే శాఖ సహాయమంత్రి, మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు ఇతర రంగాలకు చెందిన మహిళలు సంప్రదాయ చీరకట్టులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘వన్‌ ఇండియా అండ్‌ ది బెస్ట్‌ ఇండియాకి’ ఈ కార్యక్రమం ఉదాహరణగా నిలిచిందన్నారు. సూరత్‌ లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి యు-టర్న్‌ వరకూ ఈ సూరత్‌ శారీ వాకథాన్‌ జరిగింది. మహిళల పిట్‌నెస్‌గా అవగాహన కల్పించడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ సంప్రదాయాలు, చీరకట్టు గొప్పదనం మరోసారి చాటిచెప్పిందని పలువులు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..