Long-Life: అనారోగ్యం లేని చిరాయువు కావాలంటే తినాల్సిన ఆహారాలివే.. తింటే 100 సంవత్సరాలు ఖాయం..!

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అ క్రమంలోనే కొందరు కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ చిన్న వయసులోనే చనిపోతున్నారు. అయితే ఈ సమస్యలను నిరోధించడం, ఇంకా ఎక్కువ కాలం జీవించడం అనేది..

Long-Life: అనారోగ్యం లేని చిరాయువు కావాలంటే తినాల్సిన ఆహారాలివే.. తింటే 100 సంవత్సరాలు ఖాయం..!
Foods For Longevity
Follow us

|

Updated on: Apr 10, 2023 | 5:38 AM

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అ క్రమంలోనే కొందరు కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ చిన్న వయసులోనే చనిపోతున్నారు. అయితే ఈ సమస్యలను నిరోధించడం, ఇంకా ఎక్కువ కాలం జీవించడం అనేది మనం తీసుకునే ఆహారాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో మీరు కొన్ని రకాల ఆహారాలను క్రమంగా తినాలి.అంతేకాక జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలా చేసి నిపుణులు సూచించిన ఆహారాలను తింటే మీరు దీర్ఘ ఆయుష్పును పొందుతారు. ఇంకా కనీసం 100 సంవత్సరాలు ఏ ఆరోగ్య సమస్యా లేకుండా గడుపుతారు. ఈ క్రమంలో మీరు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె: తేనెతో ఎన్నో రకాల ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. వేడి నీటిలో తెేనె, నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారు. అలాగే పచ్చి తేనెలో ఉండే సహజ పదార్థాలు గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా నిరోధిస్తాయి. అంతేకాక తేన మన రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను దూరం పెడుతుంది. అలాగే ఇది ఉదర సమస్యలకి కూడా చక్కని పరిష్కారం.

దానిమ్మ పండు: దానిమ్మ పండు విటమిన్ ఎ, సి, ఈ వంటి విటమిన్లకు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సీ, ఫోలేట్, పొటాషియం వంటి ఖనిజాలకు మంచి మూలం. వీటిని తినడం వల్ల దీర్ఘాయువు పెరుగుతుంది. అలాగే ఈ పండులో ఉండే యాంటీ-వైరల్, యాంటీ-ట్యూమర్ గుణాలు.. మనిషి దీర్ఘకాలం జీవించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇది వృద్ధాప్యాన్ని నిరోధించడంతో కూడా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

పులిసిన ఆహారాలు: పులిసిపోయినన ఆహారాలను తినడం వల్ల మన జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలతో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, దీర్ఘాయువుని అందిస్తాయి. అంతేకాక శరీర రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి.

అరటికాయ: ఆకుపచ్చ రంగులో ఉండే అరటికాయలు శరీరానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఆహారాన్ని లభిస్తుంది. ఇందులో ఉండే ప్రీబయోటిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ అరటిపండు తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50 శాతం వరకు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..