Telugu News India News 21 years Youngster and his cousin brutally thrashed on suspicions of being a couple in Khandwa, video surfaces
Shocking Video: ఇంత పైశాచికత్వమా..? అక్కాతమ్ముళ్లను కట్టేసి కొట్టిన గ్రామస్థులు.. ఒకే మంచంపై కూర్చున్నారని..
మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో జరిగిన ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జ్ఞాన్‌లాల్ అనే 21 ఏళ్ల యువకుడిని, అతని అక్క కళావతిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు గ్రామస్థులు. ఖాండ్వా జిల్లా పిప్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..
మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో జరిగిన ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జ్ఞాన్‌లాల్ అనే 21 ఏళ్ల యువకుడిని, అతని అక్క(కజిన్) కళావతిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు గ్రామస్థులు. ఖాండ్వా జిల్లా పిప్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బామండ గ్రామంలో ఈ పైశాచిక ఘటన జరిగింది. ఇక ఏప్రిల్ 3న జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వీడియో గురువారం నెట్టింట కూడా ప్రత్యక్షమైంది. ఇక బాధితుడు జ్ఞాన్‌లాల్ తనపై జరిగిన పైశాచిక దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు.
मध्यप्रदेश के खंडवा में आने वाले पिपलोद के बामंदा गांव में एक भाई अपनी बहन के घर मिलने पहुंचा तो गांव वालों ने चरित्र शंका के चलते दोनो भाई बहन को तालिबानी सजा देते हुए एक पेड़ से बांधकर करीब एक घन्टे तक लकड़ियों और कोड़े से पीटा pic.twitter.com/E80FT0de27
బామండ గ్రామానికి చెందిన వివాహిత స్త్రీ కళావతి తన అక్క అని, ఆమెను కలిసేందుకు వచ్చానని జ్ఞాన్‌లాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము ఇద్దరం కూడా కళావతి ఇంటి ముందు ఒకే మంచంపై కూర్చున్నామని.. ఈ సన్నివేశం స్థానికుల కంట పడడంతో వారు తనతో ఆమెకు అక్రమ సంబంధం ఉందనుకుని చెట్టుకు కట్టేసి కొట్టారని తెలిపాడు. అలాగే ‘జ్ఞాన్‌లాల్ నా బావ’ అని కళావతి భర్త ఫోన్‌లో చెప్పినప్పటికీ.. గ్రామస్థులు తమను చెట్టుకు కట్టేసి కొట్టారని జ్ఞాన్‌లాల్ తన ఫిర్యాదు ద్వారా పోలీసులకు తెలియజేశాడు.
కాగా, బాధితులను(జ్ఞాన్‌లాల్, అతని అక్క కళావతి) చెట్టుకు కట్టేసి పైశాచికంగా దాడిచేసినవారిలో ముగ్గురిని అరెస్టు చేశామని, పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ చౌహాన్ తెలిపారు.