Back Pain: ఓ సారి ఇలా చేసి చూడండి.. మీ వెన్నునొప్పి 2 వారాల్లోనే మాయమైపోతుంది..
చాలా మంది ఎక్కువ సమయం పాటు లెగవకుండా కూర్చోనే పనిచేస్తుంటారు. అలాంటివారిలో సర్వసాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలలో వెన్నునొప్పి కూడా ఒకటి. ఈ నొప్పి కారణంగా ఇంటి పనులు చేయడం కూడా చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో..
చాలా మంది ఎక్కువ సమయం పాటు లెగవకుండా కూర్చోనే పనిచేస్తుంటారు. అలాంటివారిలో సర్వసాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలలో వెన్నునొప్పి కూడా ఒకటి. ఈ నొప్పి కారణంగా ఇంటి పనులు చేయడం కూడా చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో కొన్ని రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి. అందుకోసం మకరాసనం, శలభాసనం, మర్కటాసనం, భుజంగనాసనం వంటి సాధారణ ఆసనాలను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి నుంచి అనతి కాలంలోనే ఉపశమనం లభిస్తుంది. అలాగే రెండు గంటలకు మించి ఒకే భంగిమలో కూర్చోకపోవడం మంచిది. అలా కూర్చునే పరిస్థితి అయితే కనీసం 2 గంటలకు ఒకసారి అంటే ఐదు నిమిషాల విరామం తీసుకోవాలి. అలా చేయడం వల్ల వెన్నునొప్పి కలగదు. ఇంకా నొప్పి ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
అలాగే వెన్నునొప్పి ఉన్నవారు ఆవాలు లేదా నువ్వుల నూనెతో వీపుపై మసాజ్ చేయించుకోవాలి. ఇలా చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుంది. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు తల కింద దిండును ఉపయోగించకూడదు. మీకు వెన్నునొప్పి దీర్ఘకాలికంగా ఉంటే ఈ చిట్కాలతో పాటు ఆయుర్వేద మందులు నొప్పిని తగ్గించడంలో సమర్దవంతంగా పనిచేస్తాయి. ఇంకా సరైన పద్దతిలో కూర్చోకపోవడం వల్ల వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి సరైన భంగిమలలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఇంతేకాక వెన్నునొప్పిని తగ్గించే ఆహారాలు అంటే ట్యూనా చేపని తినాలి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..