Shubman Gill: గిల్ బ్యాట్ నుంచి పరుగుల వర్షం.. కట్‌చేస్తే, ఒకే రోజు 2 రికార్డులు.. వివరాలివే..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో విజయం సాధించింది. లక్ష్య చేదనలో విజయంపై కోల్‌కతా ఆశలు వదిలేసున్న సమయంలో.. ఆ టీమ్ బ్యాటర్ రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు కొట్టి హీరోగా తన జట్టును గెలిపించున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోమ్ టీమ్‌పై 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో విజయం సాధించింది. లక్ష్య చేదనలో కోల్‌కతా తన విజయంపై ఆశలు వదిలేసున్న సమయంలో.. ఆ టీమ్ బ్యాటర్ రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు కొట్టి హీరోగా తన జట్టును గెలిపించున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ క్రమంలో గుజరాత్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ 39(5 ఫోర్లు) పరుగులు చేశాడు. దీంతో అతను ఐపీఎల్ కెరీర్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన 48వ ఆటగాడిగా కూడా గిల్ అవతరించాడు. ఇప్పటివరకు 77 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఈ రోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఇప్పటివరకు 217 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 6,727 పరుగులు చేశాడు. మరోవైపు కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ 5 ఫోర్లు కూడా బాదాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 200 బౌండరీలు బాదిన 42వ బ్యాటర్‌గా కూడా గిల్ నిలిచాడు.