AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌.. ఐపీఎల్‌ ఉన్నంతకాలం గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌

చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌. ఐపీఎల్‌ ఉన్నంతకాలం గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌. రింకూసింగ్‌ అదరగొట్టేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఊచకోత. అప్పటికప్పుడు అమ్మవారు పూనినట్టు చెలరేగిపోయాడు రింకూ సింగ్. సిక్సర్ల మోత మోగించాడు.

Rinku Singh: చరిత్రలో నిలిచిపోయే  మ్యాచ్‌.. ఐపీఎల్‌ ఉన్నంతకాలం గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌
Rinku Singh
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2023 | 10:46 AM

Share

చివరి ఓవర్లో చివరి బంతికి సిక్సర్‌ కొట్టి గెలిపించేవాళ్లున్నారు. రేర్‌ కేసుల్లో రెండు సిక్సులు కొట్టినోళ్లని చూశాం. కాని ఇది రేరెస్ట్‌ ఆఫ్‌ ది రేర్‌. చివరి ఓవర్లో ఏకంగా ఐదు వరుస సిక్సర్లు బాది హిస్టారికల్‌ విక్టరీ అందించాడు రింకూసింగ్‌. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్లో కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ తర్వాత మ్యాచ్‌ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆరు బంతుల్లో 29 పరుగులు సాధించాల్సిన టైమ్‌లో ఉమేష్‌ యాదవ్‌ ఫస్ట్‌ బాల్‌కి సింగిల్‌ తీసి రింకూసింగ్‌కి ఇచ్చాడు. అయినా అయిపోయిన మ్యాచ్‌కి చివరి తంతు జరుగుతుంది అని అంతా అనుకున్నారు. కాని మ్యాచ్‌ అక్కడే మొదలైంది.

బౌలర్‌ యష్‌ దయాల్‌కి మోత అక్కడే మొదలైంది. రెండో బంతిని డీప్‌ కవర్‌ దిశగా సిక్స్‌ బాదాడు రింకూ. మూడో బంతి కూడా అదే జోష్‌లో కొట్టాడు అదీ బౌండరీ అవతల పడింది. నాలుగో బాల్‌కి గుజరాత్‌ సంకోచించింది. కాని ఒక్క బంతినైనా డాట్‌ చేసే మ్యాచ్‌ మనదే అనుకున్నారు. కాని.. ఫుల్‌ టాస్‌ బంతిని డీప్‌ కవర్‌ పాయింట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టాడు రింకూ.. కోల్‌కతా క్యాంప్‌లో ఆనందం మొదలైంది. ఇంకా రెండు బాల్సే. కొట్టాల్సింది పది పరుగులే. గుజరాత్‌ టీమ్‌ డైలమాలో పడింది. ఈసారి యష్‌ స్లోబంతిని సంధించినా.. రింకూ బలంగా బాది లాంగాన్‌ దిశగా సిక్సర్‌గా బాది మ్యాచ్‌ మొత్తాన్ని కోల్‌కతా వైపుకు తిప్పాడు.

చివరిబాల్‌ కూడా రింకూ సిక్సర్‌ బాది… కోల్‌కతాకి చారిత్రక విజయాన్ని అందించాడు. కోల్‌కతా క్యాంపులో ఆనందం అనేది చిన్న పదం.. అంతకు మించిన సంబరాలు జరిగాయి. రింకూ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌ అభిమానులను కేరింతలు కొట్టేలా చేసింది. నభూతో నభవిష్యత్‌. టార్గెట్‌ చేసింగ్‌లో చివరి ఓవర్‌ చివరి ఐదు బాల్స్‌ని సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను గెలిపించడం ఇంత ముందు జరగలేదు.. ఇకపై జరుగుతుందో లేదో తెలియదు.

మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..