- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: GT vs KKR Shubman Gill Becomes Second Youngest Player To Complete 2000 IPL Runs and Breaks Sanju Samson, Virat Kohli’s Record
IPL 2023: శామ్సన్, కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గిల్.. ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా..
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్‌పై కోల్‌కతా తరఫున 39 పరుగులు సాధించిన శుభ్‌మన్ గిల్.. ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాక ఈ క్రమంలో అతను సంజూ శామ్సన్, విరాట్ కోహ్లీ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు.
Updated on: Apr 11, 2023 | 6:05 AM

ఐపీఎల్ 2023: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో గుజరాత్‌పై3 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ తరఫున 39 పరుగులు సాధించిన శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో2000 (మొత్తం 2016)పరుగులు పూర్తి చేసుకున్నాడు.

విశేషమేమిటంటే ఈ 2 వేల పరుగులతో గిల్.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన 2వ యువ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాక అంతకముందే ఈ ఘనతను సాధించి యువ ఆటగాడిగా కొనసాగుతున్న సంజూ శామ్సన్, విరాట్ కోహ్లీని గిల్ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు.

రిషబ్ పంత్ 23 ఏళ్ల 27 రోజుల వయసులో ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు. దీని ద్వారా రిచ్ క్రికెట్ లీగ్‌లో 2000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా పంత్ కొనసాగుతున్నాడు.

తాజాగా , ఆదివారం జరిగిప మ్యాచ్‌లో 23 ఏళ్లు, 214 రోజుల వయస్సు ఉన్న శుభ్‌మన్ గిల్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ తర్వాత ఐపీఎల్‌లో 2000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు గిల్.

అయితే అంతకముందు రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్ ఉండేవాడు. సంజూ శామ్సన్ 24 ఏళ్ల 140 రోజుల వయసులో 2000 ఐపీఎల్ పరుగులు చేసి రెండో ప్లేయర్‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని గిల్ సొంతం చేసుకున్నాడు.

అలాగే శామ్సన్ తర్వాతి స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 24 సంవత్సరాల175 రోజుల వయసులో విరాట్ 2000 ఐపీఎల్ పరుగులు చేశాడు. గిల్ 2000 పరుగులు చేయకముదు.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా ఉన్న కోహ్లీ ఇప్పుడు నాలుగో స్థానంలోకి దిగాడు.

ఇక ఐపీఎల్‌లో కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన శుభ్‌మన్ గిల్ మొత్తం 74 ఇన్నింగ్స్‌ల ద్వారా 200 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతని బ్యాట్ నుంచి 15 హాఫ్ సెంచరీలు రావడం విశేషం.





























