IPL 2023: ఉత్కంఠపోరులో లక్నోదే విజయం.. ఆర్‌సీబీ ‘త్రిమూర్తుల’ హఫ్ సెంచరీలు వృధా..

బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠబరిత పోరులో హోమ్ టీమ్ ఆర్‌సీబీపై లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. వరుస వికెట్లు కోల్పోయిన లక్నోకి విజయం సందేహమే అనుకున్న ఈ మ్యాచ్‌లో.. చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా విజయం ఆ టీమ్ సొంతమైంది. ఇక లక్నో తరఫున..

IPL 2023: ఉత్కంఠపోరులో లక్నోదే విజయం.. ఆర్‌సీబీ ‘త్రిమూర్తుల’ హఫ్ సెంచరీలు వృధా..
Lsg Won The Match Against Rcb By 1 Wicket
Follow us

|

Updated on: Apr 11, 2023 | 12:25 AM

IPL 2023: బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠబరిత పోరులో హోమ్ టీమ్ ఆర్‌సీబీపై లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. వరుస వికెట్లు కోల్పోయిన లక్నోకి విజయం సందేహమే అనుకున్న ఈ మ్యాచ్‌లో.. చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా విజయం ఆ టీమ్ సొంతమైంది. అయితే అంతకముందు ఆర్‌సీబీ తరఫున హాఫ్ సెంచరీలు చేసి త్రిమూర్తులుగా నిలిచిన కోహ్లీ, డూప్లెసీస్, మ్యాక్స్‌వెల్ పరుగులు వృధా అయ్యాయి. ఇక లక్నో తరఫున మార్కస్ స్టోయినిస్ 65, నికోలస్ పూరన్ 62, ఆయుష్ బదోని 30, కేఎల్ రాహుల్ 18 పరుగులతో రాణించారు. అయినప్పటికీ చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌ని లక్నో టెయిలెండర్లే గెలిపించారని చెప్పుకోవాలి. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ తరఫున రంగంలోకి దిగిన నలుగురిలో ముగ్గురు అర్థశతకాలు పూర్తి చేసుకున్నారు. అలాగే ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ తమ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఈ ఇద్దరు కలిసి మొదటి వికెట్‌కి 96 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే 12వ ఓరవ్ వేసిన అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చిన కింగ్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రీజులోకి దిగి, ఫాఫ్‌తో జత కలిసాడు. అంతే.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఈ ద్వయం రెండో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరు చివరి బంతి వరకు నిలబడతారు అనుకున్న టైమ్‌లోనే ఈ ద్వయాన్ని విడగొట్టాడు లక్నో బౌలర్ మార్క్ వుడ్. వుడ్ వేసిన 20వ ఓవర్ 5వ బంతిని ఆడిన మ్యాక్సీ(59) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక అతను డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టడంతో దినేష్ కార్తిక్(1) మైదానంలోకి దిగి ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీశాడు. అలాగే కెప్టెన్ డూప్లెసీస్ అజేయంగా 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో లక్నో తరఫున మిశ్రా, మార్క్ వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఆ టీమ్ ఓపెనర్ కైల్ మేయర్స్(0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే అతనితో పాటు క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కొంతవరకు నిలకడగా రాణించాడు. కానీ మేయర్స్ ఔట్ తర్వాత వచ్చిన దీపక్ హుడా(9), కృనాల్ పాండ్యా(0) వెంటనే వెనుదిరిగారు. వారి తర్వాత మార్కస్ స్టోయినిస్.. రాహుల్‌తో కలిసి నాల్గో వికట్‌కి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలికొల్పాడు. అయితే కర్ణ్ శర్మ వేసిన బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చుకుని 65 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్(18) కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఇక అప్పుడు వచ్చాడు నికోలస్ పూరన్. రావడమే ఆలస్యం, స్టోయినిస్‌తో కలిసి 84 పరుగుల పార్ట్నర్‌షిప్‌ని అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే రెండో హాఫ్ ఫాస్టెస్ట్ సెంచరీ(15 బంతుల్లో) కూడా పూర్తి చేసుకున్నాడు. అనంతరం 62 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆపై వచ్చిన ఆయుష్ బదోని 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

కాగా, చివరి ఓవర్‌లో 5 పరుగులు చేయాలన్న సమయంలో 2వ బంతికి మార్క్‌వుడ్(1), 5 బాల్‌కి ఉనాద్కడ్(9) పరుగులతో వెనుదిరిగారు. ఈ క్రమంలో మ్యాచ్‌ చేజారిన పరిస్థితి అయితే రవి బిష్ణోయ్ ఆడిన చివరి బంతికి బైస్ రూపంలో 1 పరుగు రావడంతో విజయం లక్నో సొంతమైంది. ఇక క్రీజులో విష్టోయ్(3), ఆవేష్ ఖాన్(0) ఉన్నారు. ఈ క్రమంలో ఆర్‌సీబీ తరఫున మహ్నద్ సిరాజ్, వేన్ పార్నెల్ చెరో 3 వికెట్లు, హర్షల్ పటేల్ 2, కర్ణ్ శర్మ 1 వికెట్ తీసుకున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్