19 బంతుల ఊచకోత.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఆర్సీబీని మటాష్ చేసిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చివరి బంతికి అద్భుతమైన విజయం సాధించింది..

19 బంతుల ఊచకోత.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఆర్సీబీని మటాష్ చేసిన మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్
Nicholas P
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 11, 2023 | 7:54 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చివరి బంతికి అద్భుతమైన విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. లక్నో ఆ లక్ష్యాన్ని చివరి బంతికి చేధించి.. విజయాన్ని అందుకుంది.

భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం అచ్చిరాలేదు. 23 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును మార్కస్ స్టోయినిస్ ఆదుకున్నాడు. మాజీ ఆర్సీబీ ప్లేయర్ అయిన అతడు.. ఆ జట్టుపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా బెంగళూరు బౌలర్లు కరణ్ శర్మ, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కున్న స్టోయినిస్ 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. ఇక అతడు ఔట్ అయిన సమయంలోనూ లక్నో గెలుస్తుందన్న అంచనా ఎవ్వరికీ లేదు.

ఇవి కూడా చదవండి

అప్పుడు బరిలోకి దిగిన నికోలస్ పూరన్.. 19 బంతుల్లో ఊచకోత కోశాడు.. తన మాజీ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి సమాధానం ఇచ్చి.. తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. వీరిద్దరూ బ్యాట్‌తో తమ పవర్ చూపించకపోయి ఉంటే.. లక్నో విజయం సాధించేదే కాదు.