Tollywood: ‘జై చిరంజీవ’లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.! ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

ఎంతోమంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిన్న వయస్సులోని..

Tollywood: 'జై చిరంజీవ'లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.! ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?
Tollywood
Follow us

|

Updated on: Apr 10, 2023 | 9:00 PM

ఎంతోమంది నటీమణులు చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిన్న వయస్సులోని వారు మంచి గుర్తింపును సైతం పొందారు. అలా అప్పట్లో తెలుగువారి మనసును గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో ఒకరు శ్రియా శర్మ. ఆ సమయంలో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తొచ్చిందా.. అదేనండీ.. ‘జై చిరంజీవ’లో చిరంజీవి మేనకోడలుగా నటించిన చిన్నారి గుర్తుంది కదా.. తన చిన్ని చిన్ని మాటలతో అప్పట్లో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆమెనే శ్రియా శర్మ.

శ్రియా శర్మ.. చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు’, రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రచ్చ’, ‘నాని హీరోగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అటు శ్రియా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ, కన్నడ భాషల్లో కూడా బిజీ అయింది. అలాగే హిందీలో పలు సీరియల్స్‌లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. మరోవైపు 2015లో ‘గాయకుడు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం హిందీలో ‘బిల్లు గేమర్’ అనే చిత్రంలో నటించింది. ఇక 2016లో రోషన్ సరసన ‘నిర్మలా కాన్వెంట్’లో హీరోయిన్‌గా చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక శ్రియా శర్మ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. తండ్రి ఇంజనీర్ కాగా.. తల్లి డైటీషియన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న ఈమెకు.. వృత్తిపైనే ఆసక్తి ఎక్కువగా ఉందట.