Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మెరుగైన కంటిచూపు కావాలంటే ఈ పండు తినాల్సిందే.. తింటే మీ గుండె భద్రం , క్యాన్సర్ దూరం..

కాలంలో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్లలో జామపండు కూడా ఒకటి. ఈ పండు తినడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే ఈ పండుని పేదవాడి యాపిల్ పండు అంటారు. అంటే యాపిల్ పండు..

Health Tips: మెరుగైన కంటిచూపు కావాలంటే ఈ పండు తినాల్సిందే.. తింటే మీ గుండె భద్రం , క్యాన్సర్ దూరం..
Eyecare
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 11, 2023 | 6:59 AM

Health Tips: కాలంలో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్లలో జామపండు కూడా ఒకటి. ఈ పండు తినడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే ఈ పండుని పేదవాడి యాపిల్ పండు అంటారు. అంటే యాపిల్ పండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో అవన్ని కూడా జామ పండు నుంచి కూడా అందుతాయని అర్థం. ఇక ఈ పండులో పుష్కలంగా ఉండే పోషకాలే ఇలా అనడానికి కారణం. జామపండ్లు మానవ శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలను అందించగలవు. ఇంకా మన కంటిచూపును కూడా మెరుగుపరచగలవు. మరి ఈ జామపండును నిత్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జామ పండు ఆరోగ్య ప్రయోజనాలు

జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉన్నందున ఇది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి చూపుని కాడాడుతూ, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు కావలసిన విటమిన్ ఏ వంటి పోషకాలు కూడా జామపండులో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇది కంటిశుక్లాల సమస్యను నిరోధిస్తుంది. జామపండులోని గుణాలు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తి, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకు జామలో పుష్కలంగా ఉండే లైకోపీన్ అనే పదార్థమే కారణమని చెప్పుకోవాలి. ఇంకా జామపండులో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున ఇది జీర్ణసంబంధిత సమస్యలకు కూడా చక్కని పరిష్కారం.

అలాగే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడంతో ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఉపకరిస్తుంది. జామపండులో బీపీని కంట్రోల్ చేసేందుకు కావలసిన సోడియం, పోటాషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇవి మీ గుండెను సైతం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే కాక జామ పండులో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B-9ని కలిగి ఉన్నందున.. ఇది గర్బిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరం. కండరాల, నరాల నొప్పిని తగ్గించడంలో కావలసిన మెగ్నిషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంది. అలాగే మెదడుకు రక్తప్రసరణ చేయడంలో ఉపయోగపడే విటమిన్ B3, B6 కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..