- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: KL Rahul To Nicholas Pooran list of IPL Players who have scored Fastest Fifties in The League
Fastest 50s in IPL: ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 ‘అర్థ శతక’ వీరులు వీరే.. లిస్టులో ఇద్దరే ఇండియన్స్..
పరుగుల పండుగకు నిలయమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ చెలరేగాడు. కేవలం 15 బంతులలోనే 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు. మరి అతని కంటే ముందు ఈ రికార్డును ఎవరెవరు సాధించారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 12, 2023 | 6:20 AM

2018 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడిన కేఎల్ రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం ఇదే కావడం విశేషం. ఈ హాఫ్ సెంచరీ కోసం రాహుల్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లను బాదాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్‌ట(2022)లో ముంబై ఇండియన్స్ జట్టుపై కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా కేఎల్ రాహుల్ పేరిట ఉన్న రికార్డును పాట్ కమ్మిన్స్ సమం చేశాడు.

అలాగే ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్లలో యూసుఫ్ పఠాన్ మూడో స్థానంలో ఉన్నాడు. 2014లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన యూసుఫ్15 బంతుల్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 15 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం ద్వారా నరైన్ ఈ లిస్టులో స్థానాన్ని కలిగి ఉన్నాడు.

తాజాగా సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఆర్‌సీబీపై విజృంభించి ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.




