ధోనీ కేప్టెన్సీలో ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్స్ గెలుచుకుంది. అయిదు సార్లు ఫైనల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్‌ను ఎగరేసుకెళ్లిందీ ఎల్లో ఆర్మీ. 2016, 2017 సీజన్ల నుంచి తప్పుకొంది. 2000, 2022 సీజన్లల్లో అత్యంత అధ్వాన్న ఆటతీరును ప్రదర్శించింది చెన్నై సూపర్ కింగ్స్. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు.