Andhra Pradesh: అరసవెల్లిలో భక్తులకు నిరాశ.. సూర్యనారాయణ స్వామిని తాకని కిరణాలు..

Andhra Pradesh: శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావిస్తుంటారు. మండపం, ధ్వజ స్తంభాన్ని దాటుకొని ఆలయ ప్రాకారానికి 400 అడుగులు దూరంలో ఉన్న మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం.

Andhra Pradesh: అరసవెల్లిలో భక్తులకు నిరాశ.. సూర్యనారాయణ స్వామిని తాకని కిరణాలు..
Arasavalli Temple
Follow us

|

Updated on: Oct 01, 2023 | 10:08 PM

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం.. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రముఖమైన దేవాలయం.. ఇక్కడి మూలవిరాట్ ఏక సాలిగ్రామ శిలతో రూపుదిద్దుకుని ఉంటుంది. సాక్షాత్తు ఇంద్ర భగవానుడి చేత నెలకొల్పబడినట్టు చరిత్ర చెప్తోంది. ఇక్కడ ప్రతిఏటా రెండు సార్లు అద్భుతం జరుగుతుంది. సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ప్రతి ఏటా ఉత్తరాయణంలో అయితే మార్చి 8,9 తేదీల్లో, దక్షిణాయనంలో అయితే అక్టోబర్ 1,2 తేదీల్లో ఆలయ గర్భ గుడిలోని స్వామి వారి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతాయి. ఈ లెక్క ప్రకారం నిన్న స్వామి వారి విగ్రహానికి సూర్య కిరణాల స్పర్శ ఉంటుందని అంతా భావించారు. అందుకోసం అధికారులు సైతం భారీగా ఏర్పాట్లు చేశారు.

ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు.. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. తెల్లవారు జాము నుంచే ఆలయంలో బారులు తీరారు. అయితే భక్తులకు నిరాశే ఎదురైంది. శనివారం రాత్రి నుంచి చిరుజల్లులు మబ్బులతో వాతావరణం ఉండటంతో సూర్య కిరణాలు ఆలయంలోని స్వామి వారి విగ్రహంపై పడలేదు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.

శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాతగా భక్తులు భావిస్తుంటారు. మండపం, ధ్వజ స్తంభాన్ని దాటుకొని ఆలయ ప్రాకారానికి 400 అడుగులు దూరంలో ఉన్న మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా ఆవిష్క్రతమయ్యే అద్భుత ఘట్టం ఈసారి కనిపించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు భక్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..