AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరిసే చర్మం, ముఖంలో నిగారింపు కోసం టమాటాను ఇలా ఉపయోగించండి!

టీ స్పూన్ శ‌న‌గ‌పిండి, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ రోజ్ వాట‌ర్ ను వేసి మంచి ఫేస్‌ ప్యాక్‌ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసే ముందు.. ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని స్మూత్‌గా మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది.

మెరిసే చర్మం, ముఖంలో నిగారింపు కోసం టమాటాను ఇలా ఉపయోగించండి!
Tomato
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2023 | 9:51 PM

Share

అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు..అందుకోసం బ్యూటీపార్లర్లు, వైద్యులను సంపద్రించి ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీములు వాడతారు. చివరకు అనుకున్న ఫలితం రాక అవస్థలు పడుతుంటారు.. అలాంటి వారికి మన వంటింట్లోనే ఉండే.. టమాటా అద్భుతం చేస్తుంది. టమాటాలను సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు. టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. టమాటాలో లైకోపీన్ అనే పదార్ధం ఉండటం వల్ల చర్మ సమస్యలను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. ఇలా టమాటాను చర్మానికి వాడితే డల్ గా ఉన్న చర్మాన్ని మెరిపిస్తుంది. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తో సహా సమస్య తొలగిపోయి చర్మం రంగు మెరుగవుతుంది. చర్మం నుండి డెడ్ స్కిన్, మురికిని తొలగించడానికి టమాటాను సగానికి కట్ చేయండి. ఆ తర్వాత సగం టమాటాను రసాన్ని తీసి కాటన్‌తో చర్మంపై అప్లై చేయాలి. రసం ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

చర్మంపై జిడ్డు ఈజీగా తగ్గాలంటే టమాటాను కోసి ఆ రసాన్ని చర్మానికి పట్టించాలి. దాన్ని అలాగే ఓ పావుగంట సేపు ఆరనివ్వాలి.. ఆ తరువాత మీరు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మీ చర్మం బాగా మెరిసిపోతుంది.

ఒక టమాటాను రసం తీసి దానికి రెండు చిటికెల పసుపు, అర టీస్పూన్ గంధపు పొడిని వేసి పేస్ట్‌ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి సరిగ్గా ఆరనివ్వాలి. పేస్ట్ ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారం రోజుల పాటు వాడితే చర్మ సమస్యలు పోతాయి.

ఇవి కూడా చదవండి

మీరు చర్మం నుండి డెడ్ స్కిన్ తొలగించాలనుకుంటే, ఒక గిన్నెలో టమాటా జ్యూస్ తీసుకుని అందులో పంచదార కలపండి. ఇప్పుడు ఈ స్క్రబ్‌ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయండి. ముఖానికి రెండు మూడు నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

టమాటా రసంలో టీ స్పూన్ శ‌న‌గ‌పిండి, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ రోజ్ వాట‌ర్ ను వేసి మంచి ఫేస్‌ ప్యాక్‌ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసే ముందు.. ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని స్మూత్‌గా మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి