AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసు మింగిన గేదె..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అనుభవజ్ఞుడైన పశువైద్యుడు గేదె పొట్టను పరిశీలించాడు. సీనియర్ వెటర్నరీ డాక్టర్ గేదెను మెటల్ డిటెక్టర్ ద్వారా గేదె పొట్టలో ఉన్న బంగారు గొలుసు గురించి పక్కా సమాచారం తెలుసుకున్నారు. గేదె కడుపులోని బంగారు గొలుసును తీసేందుకు ప్రయత్నించారు. పేడలోంచి గొలుసు బయటకు వచ్చే అవకాశం కోసం కూడా వేచి చూశారు. అయితే ఆ గేదె కడుపులో నుంచి గొలుసు బయటకు రాదని డాక్టర్ ఆ గేదె యజమానికి చెప్పాడు. దీంతో..

రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసు మింగిన గేదె..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Buffaloes Chew The Gold Chain
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2023 | 9:16 PM

Share

పెంపుడు జంతువుల వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొవడం తప్పదు. ఆవులు, గేదెలు, పిల్లులు, కుక్కల నుండి యజమానులు తిప్పలు పడటం సర్వసాధారణం. అదేవిధంగా మహారాష్ట్రలోని మంగ్రుల్పిర్ (వాషిం)లోని సర్సీ గ్రామంలో విలువైన బంగారు గొలుసును గేదె మింగేసింది. ఇంటి యజమాని తన గేదెకు సోయాబీన్ పొట్టు తినిస్తుండగా ప్రమాదవశాత్తు మెడలోని బంగారు గొలుసు తెగిపోయింది. కానీ, ఇవేమీ పట్టించుకోకపోవడంతో గేదెకు తినిపించిన ఆహారంతో పాటు బంగారు గొలుసు కూడా గేదె కడుపులోకి చేరిపోయింది. పోయిన బంగారు గొలుసు 3.5 తులాల బరువుతో సుమారు..రూ.2.5 లక్షలు పలుకుతుందని అంచనా.

ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గల్లంతైన మహిళ భర్తకు చెప్పింది. అప్పుడు ఇంట్లో అందరూ బిజీ. ఆమె ఎక్కడికి వెళ్లింది, ఏం చేసిందని భర్త ఆరా తీస్తే గేదెకు కూరగాయల తొక్కలు తినిపించడం గురించి కూడా చెప్పింది. ఎక్కడా బంగారు గొలుసు కనిపించకపోవడంతో గేదె గొలుసును మింగేసి ఉంటుందని గ్రహించి గేదెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అనుభవజ్ఞుడైన పశువైద్యుడు గేదె పొట్టను పరిశీలించాడు. సీనియర్ వెటర్నరీ డాక్టర్ గేదెను మెటల్ డిటెక్టర్ ద్వారా గేదె పొట్టలో ఉన్న బంగారు గొలుసు గురించి పక్కా సమాచారం తెలుసుకున్నారు. గేదె కడుపులోని బంగారు గొలుసును తీసేందుకు ప్రయత్నించారు. పేడలోంచి గొలుసు బయటకు వచ్చే అవకాశం కోసం కూడా వేచి చూశారు. అయితే ఆ గేదె కడుపులో నుంచి గొలుసు బయటకు రాదని డాక్టర్ ఆ గేదె యజమానికి చెప్పాడు.

ఇక, దాంతో చేసేది లేక గేదె పొట్టలోంచి బంగారు గొలుసును శస్త్రచికిత్స చేసి బయటకు తీయాలని వైద్యులు చెప్పారు. దీనికి యజమాని కూడా అనుమతి ఇవ్వడంతో గేదె కడుపులో బంగారు గొలుసు ఎక్కడ ఉందో కచ్చితమైన విషయాన్ని తెలుసుకునేందుకు సోనోగ్రఫీ చేశారు. అనంతరం గేదె కడుపుకు ఆపరేషన్ చేసి బంగారు గొలుసును తొలగించారు. చైన్ దొరకడంతో యజమాని సంతోషం వ్యక్తం చేస్తూ గేదె ఆరోగ్యం కోసం వైద్యులను ఆశ్రయించారు. గేదెకు ఆపరేషన్ చేయడంతో ప్రాణహాని లేకుండా హాయిగా ఉందని, గాయం మానిపోయే వరకు చికిత్స కొనసాగుతుందని డాక్టర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

గేదెల శస్త్రచికిత్స గురించి డాక్టర్ కౌండిన్య మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్, మెటల్, నాణేలు వంటి ఎన్నో ప్రమాదకరమైన వాటిని తిన్నప్పుడు ఆవులకు చికిత్స చేసి వాటి శరీరంలోని ప్రమాదకరమైన వాటిని తొలగించేవారన్నారు. రూ. 2.5 లక్షల విలువైన బంగారాన్ని మింగిన గేదెకు ఆపరేషన్ చేసిన తొలి కేసు ఇదేనని చెప్పారు. గేదె కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లక్ చేయండి..