Viral News: మహిళను కొబ్బరి కాయతో కొట్టిన కోతి.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

కోతి చేష్టల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు. తనకు ఏది నచ్చితే అది ఎత్తుకెళ్లిపోతుంది. తనకు నచ్చింది చేస్తుంది. జనాలను విసిగిస్తుంటుంది. ఇళ్లలోకి దూరితే నానా హంగామా క్రియేట్ చేస్తుంది.

Viral News: మహిళను కొబ్బరి కాయతో కొట్టిన కోతి.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
Woman Vs Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 02, 2023 | 5:49 AM

Viral News: కోతి చేష్టల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు. తనకు ఏది నచ్చితే అది ఎత్తుకెళ్లిపోతుంది. తనకు నచ్చింది చేస్తుంది. జనాలను విసిగిస్తుంటుంది. ఇళ్లలోకి దూరితే నానా హంగామా క్రియేట్ చేస్తుంది. కోతికి సాధారణంగా కొన్ని రకాల పండ్లు అంటే ఇష్టం. అవి ఎవరి చేతిలో కనిపించినా వెంటనే అటాక్ చేసి లాక్కుంటుంది. ఇక కొబ్బరి కాయల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ దేవాలయంలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా హడావుడి చేస్తుంటాయి. కొబ్బరి చిప్ప కనిపిస్తే చాలు.. వెంటనే అందుకుని పారిపోతాయి. ఇవి తమ కడుపు నింపుకోవడానికి ఆహారం ఎత్తుకెళ్తే సమస్య లేదు. కానీ, ఆహారం కోసం మనుషులపై అటాక్ చేయడమే జనాలకు పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో కోతుల మందలు అరణ్యాలను వదిలి జనావాసాలపై పడుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, సరైన ఆహారం దొరక్కపోవడంతో కోతులు ఇళ్ల మధ్యలోకి వస్తున్నాయి.

తాజాగా ఓ కోతి ఓ మహిళపై దాడి చేసింది. అది అట్టాంటి ఇట్టాంటి దాడి కాదండోయ్.. కొబ్బరి చెట్టు నుంచి నేరుగా కొబ్బరి బోండాన్ని మహిళపై విసిరేసింది. ఆ దెబ్బకు మహిళ విలవిల్లాడిపోయింది. అంతెత్తు నుంచి కొబ్బరి బోండా ఆమె చేయి మీద పడగా.. ఆ చెయ్యి విరిగిపోయింది. దాంతో ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన నిలంబూర్ లోని అమరంబలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమరంబలం ప్రాంతానికి చెందిన సలోమి(56) తన ఇంట్లో కొబ్బరి చెట్లను పెంచుతోంది. ఆ కొబ్బరిచెట్టుకు బోలెడన్ని కొబ్బరి కాయలు కూడా ఉన్నాయి. అయితే, కొబ్బరి కాయలను తినేందుకు ఓ కోతి వచ్చి చెట్టుపై ఎక్కి కూర్చకుంది. ఇదేమీ గమనించని సలోమి.. తన ఇంటి వరండాలోకి వచ్చి కూర్చుంది. ఆమె రాకను గమనించిన కోతి.. వెంటనే దాడి చేయడం మొదలు పెట్టింది. చెట్టు మీద నుంచి కొబ్బరి బోండాన్ని తెంచి సలోమి మీదకు విసిరేసింది. దాంతో సలోమికి తీవ్ర గాయమైంది. ఆమె చెయ్యి విరిగిపోయింది. దాంతో సలోమి ఆస్పత్రిలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం సృష్టించింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??
వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త
వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త
భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!